మతమార్పిళ్లు: పాస్టర్‌పై పోలీస్ స్టేషన్లోనే మూకదాడి, ఏడుగురిపై కేసు నమోదు
రాయ్‌పూర్: బలవంతపు మతమార్పిళ్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలతో ఓ పాస్టర్‌పై పోలీస్ స్టేషన్లోనే మూక దాడి జరిగింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని పురాణిబస్తిలో చోటు చేసుకుంది. పాస్టర్‌తో తీవ్ర వాగ్వాదం తర్వాత అతడిపై దాడికి పాల్పడ్డారు. ఓ వ్యక్తి పాస్టర్‌పై చేయి చేసుకున్నాడు.
బాటగావ్ ప్రాంతంలో మతమార్పిళ్లకు పాల్పడుతుండటంతో ఆ పాస్టర్‌పై పోలీసులు ఫిర్యాదు అందింది. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలిసి పలువురు హిందుత్వ నాయకులు, స్థానికులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని వాగ్వాదానికి దిగారు. ఒకరిద్దరు ఆ పాస్టర్‌పై దాడికి పాల్పడ్డారు.

వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. అక్కడ్నుంచి వారందర్ని బయటికి పంపించారు.
బలవంతపు మతమార్పిళ్లకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
అంతకుముందు మతమార్పిళ్లకు పాల్పడుతున్న పాస్టర్, అతనితో వచ్చినవారితో హిందుత్వ నేతలు, స్థానికులు తీవ్రవాగ్వాదానికి దిగారు. ఈ ప్రాంతంలో బలవంతంపు మతమార్పిళ్లకు ఎందుకు పాల్పడుతున్నారంటూ నిలదీశారు. అయితే, మీరెందుకు ప్రశ్నిస్తున్నారంటూ ఎదురుతిరిగడంతో పాస్టర్, అతనితోపాటు వచ్చినవారిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. మూకలోని కొందరు పాస్టర్‌పై చేయి చేసుకున్నారు. ఒకరిద్దరు చెప్పులు, షూలతో దాడికి దిగారు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది.
ఇంతకుముందు తమకు ఫిర్యాదు ఏదీ అందలేదని పోలీసులు చెప్పారు. ఇరువర్గాల గొడవ కారణంగా పోలీస్ స్టేషన్లో ఎలాంటి డ్యామేజీ జరగలేదని తెలిపారు. ప్రస్తుతం తమకు అందిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని, బలవంతపు మతమార్పిళ్లకు పాల్పడినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తారకేశ్వర్ పటేల్ తెలిపారు. పాస్టర్‌పై దాడికి పాల్పడిన ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
గాస్పల్ చర్చిలో కీచక పాస్టర్: యువతులకు లైంగిక వేధింపులు
హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ గాస్పల్ చర్చిలో కీచక పాస్టర్ పాపం పండింది. పాస్టర్ ముసుగులో చర్చికి వచ్చే యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. పాస్టర్ జోసెఫ్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఉప్పల్‌లో ఆయన సొంతంగా చర్చి నిర్వహిస్తూ పాస్టర్‌గా పని చేస్తున్నాడు.
Recommended Video
అలాగే మతపరమైన టీవీ ఛానల్లో మత ప్రబోధకుడుగా కనిపించే జోసఫ్.. అమాయక ఆడపిల్లలే టార్గెట్‌గా చేసుకుని లైంగిక వాంఛలు తీర్చుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బాధితులు ఆరోపించారు. యువతులపై ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న పాస్టర్‌పై మేడిపల్లి పోలీసుస్టేషన్‌లో ఎమ్మార్పీఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. అలాగే ముగ్గురు యువతులు ఇప్పటికే జోసఫ్‌పై ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు పాస్టర్‌ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. నిందిత పాస్టర్‌ను కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications