Viral news: గర్భిణీని ఢీకొట్టిన లారీ.. తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన శిశువు..

గర్భిణీని లారీ ఢీకొన్న ఘటనలో కడుపులో ఉన్న శిశువు బయటకొచ్చిన ఘటన యూపీలో జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో బుధవారం నాడు ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది నెలల గర్భిణి తల్లి కడుపులోంచి ఓ పసికందు బయటకు వచ్చింది. చిన్నారిని ఫిరోజాబాద్ జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. తల్లి క్షేమంగా ఉందని, నవజాత శిశువులకు చికిత్స అవసరమని వైద్యులు పేర్కొన్నారు.

బైక్‌పై వెళ్తుండగా..

బైక్‌పై వెళ్తుండగా..


SHO ఫతే బహదూర్ సింగ్ బధోరియా మాట్లాడుతూ, నార్ఖీ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే బర్తర గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మహిళ పేరు కామని అని ఆమె వయస్సు 26 చెప్పారు. ఆమె తన భర్తతో కలిసి కోట్లా ఫరీహా ప్రాంతంలోని తన తల్లిదండ్రుల ఇంటికి బైక్‌పై వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

కారును తప్పించే..

కారును తప్పించే..

ఎదురుగా వస్తున్న కారు తప్పించే ప్రయత్నంలో ఆమె భర్త రాము బైక్‌ను తిప్పడంతో అది అదుపు తప్పి వారు పడిపోయినట్లు స్థానికులు తెలిపారు. కామిని కింద పడిపోగా.. వేగంగా వచ్చిన ట్రక్కు ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆమె కడుపులో ఉన్న శిశువు బయటకు వచ్చింది.

విచారణ ప్రారంభం..

విచారణ ప్రారంభం..


నవజాత శిశువు క్షేమంగా ఉందని, అవసరమైన చికిత్స అందుతోందని స్టేషన్ హౌస్ ఆఫీసర్ బధోరియా వివరించారు. బైక్ నడుపుతున్న పిల్లల తండ్రి కూడా క్షేమంగా ఉన్నారని తెలిపారు. "ట్రక్కు డ్రైవర్ వాహనాన్ని వదిలి పారిపోయాడని పేర్కొన్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని. భర్త ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామన్నారు. విచారణ కొనసాగుతోందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+