వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral Video: కారు స్టార్ట్ చేసి కిందికి దిగి రిపేర్ చేస్తున్నాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

|
Google Oneindia TeluguNews

వాహనాలతో ఎప్పుడు జగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా వాహనాలను ఆన్‍లో ఉంచి కిందికి దిగ కూడదు. ముఖ్యంగా ఆటోమెటిక్ వాహనాల్లో ఇలా అస్సలు చేయకూడదు. తాజాగా వాహన ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కారు స్టార్ట్ చేశాడు..

కారు స్టార్ట్ చేశాడు..

ఈ వీడియోలో ఓ వ్యక్తి కారు ఇంటి ముందు కారు పార్క్ చేశాడు. అయితే కారు ఏదో సమస్య వస్తే రిపేర్ చేయాలని అనుకున్నాడు. కారు మందుకు వచ్చి బానెట్ ఓపెన్ చేశాడు. ఆ తర్వాత కారులోకి వెళ్లి కారు స్టార్ట్ చేశాడు. తర్వాత ముందు ఇంజన్ లోని సమస్యను పరిశీలిస్తున్నాడు. అయితే అప్పటికే కారు స్టార్ట్ చేసి ఉండడంతో కారు ముందుకు కదలింది.

గేర్ పడి..

గేర్ పడి..

దీంతో కారు అతన్ని ఢీకొట్టుకుంటూ ముందున్న షట్టర్ ను ఢీకొట్టింది. దీంతో అతను కారు, షట్టర్ కు మధ్య ఇరుక్కుపోయాడు. అక్కడున్న వారు వెంటనే స్పందించారు. కానీ కారు వెనక్కు తీయలేకపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఈ వీడియోను దీపక్ ప్రభు అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. పోస్టు చేయడంతో పాటు ఆటోమేటిక్ వాహనం చెడిపోయినట్లయితే, వాహనం ముందు ఎప్పుడూ నిలబడకండి.
దయచేసి మీ స్నేహితులు, బంధువులకు చెప్పండి. అని కామెంట్ చేశారు.

ఎక్కడ జరిగింది..?


ఈ వీడియోకు ఇప్పటివరకు లక్ష 50 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. ఈ వీడియోపై నెటిడన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కారు స్టార్ట్ చేసి కిందికి దిగొద్దని ఒకరు కామెంట్ చేయగా.. బాధితుడు క్షేమంగా ఉండాలని మరొకరు కోరుకున్నారు.

English summary
The accident happened while the car was being repaired. The video related to this has gone viral on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X