తుపాకీతో బెదిరించి టీచర్ పై గ్యాంగ్ రేప్

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో మరో అఘాయిత్నం జరిగింది. విధులకు వెలుతున్న మహిళా టీచర్ ను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసి పరారైనారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.

ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలీలోని 24వ హైవే సమీపంలో మంగళవారం మహిళా టీచర్ స్కూల్ కు బయలుదేరారు. మార్గం మధ్యలో కొందరు దుండగులు తుపాకీతో ఆమెను బెదిరించి కారులో కిడ్నాప్ చేశారు.

తరువాత వేగంగా వెలుతున్న కారులో ఆమె మీద ఇద్దరు దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. అత్యాచారం చేసే సమయంలో మొబైల్ లో వీడియో చిత్రీకరించారు. అత్యాచారం జరిగిన విషయం బయటకు చెప్పరాదని తుపాకీతో ఆమెను బెదిరించారు.

A teacher was abducted and allegedly gang-raped in Uttar Pradesh

పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని, నీ పరువు పోతుందని బెదిరించారు. అయితే బాధితురాలు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దుండగులు బాధితురాలిని వదిలి పెట్టిన నిర్జనప్రదేశం దగ్గర వెళ్లిన పోలీసులు అక్కడ గాలించి కొన్ని ఆధారాలు సేకరించారు. బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరిక్షలు చేయించారు.

నిర్లక్షంగా విధులు నిర్వహించిన సీబీ గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ రాజేష్ సింగ్ ను సస్పెండ్ చేశామని పై అధికారులు తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్ లోని బులందర్ షహర్ గ్యాంగ్ రేప్ సంఘటన మరువకముందే టీచర్ మీద గ్యాంగ్ రేప్ జరగడంతో ప్రభుత్వం మీద ప్రజలు మండిపడుతున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The woman says while she was on her way to school, a car stopped near her and two men forcibly pulled her inside.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X