దారుణం: యువతిపై రేప్, కిరోసిన్ పోసి నిప్పింటించారు

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి(20)పై అత్యాచారానికి పాల్పడిన దుండగులు, ఆ తర్వాత ఆమెను సజీవ దహనం చేశారు. బెంంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్‌లోని నిర్జన ప్రదేశంలో ఈ ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళితే.. కోలారుకు చెందిన ఈ యువతి ఓ సంస్థలో హౌజ్ కీపింగ్ ఉద్యోగినిగా పని చేసేది. ఆమెను బలవంతంగా ఇక్కడకు తీసుకొచ్చిన దుండగులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించి పరారయ్యారు. దీంతో ఆమె సజీవ దహనమైంది.

శుక్రవారం సాయంత్రం పోలీసులు మృతదేహాన్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ఆమెకు పరిచయం ఉన్నవారే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

A teenage girl raped in Bengaluru

ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి: టీచర్ అరెస్ట్

ముంబై: ఐదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఓ 40ఏళ్ల ఉపాధ్యాయుడ్ని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుడు కొన్ని రోజులుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడు అబు చైదరిపై రేప్ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితుడికి మార్చి 4 వరకు కోర్టు కస్టడీ విధించిందని పోలీసులు తెలిపారు.

ఉర్దూ పాఠాలు నేర్చుకునేందుకు తన ఇంటికి వచ్చిన బాలికపై నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. మర్మాంగాల్లో తీవ్ర నొప్పి రావడంతో ఆ బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+