మరో ఘోరం: ఆగివున్న బస్సులో టీనేజర్‌పై గ్యాంగ్‌రేప్
డెహ్రాడూన్: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచార ఘటన మరవకముందే ఉత్తరాఖండ్‌లో ఓ టీనేజర్‌పై సామూహిక అత్యాచారం జరిగింది. డెహ్రాడూన్‌లోని అంతర్ రాష్ట్ర బస్ టెర్మినల్ వద్ద ఆగి ఉన్న బస్సులో ఐదుగురు వ్యక్తులు.. ఓ టీనేజర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆగస్టు 13న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పటేల్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలో బాధితురాలు దిక్కుతోచని స్థితిలో చెల్డ్ వెల్ఫేర్ కమిటీ బృందానికి కనిపించింది. వెంటనే ఆమెను రక్షించి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బృందం నాలుగు రోజులపాటు కౌన్సిలింగ్ ఇచ్చింది. అనంతరం బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

బాధితురాలిని ఆగస్టు 11న తన సోదరి, బావ ఇంటి నుంచి గెంటేశారు. దీంతో ఆ అమ్మాయి ఢిల్లీ మీదుగా మొరాదాబాద్ చేరుకుంది. ఆ తర్వాత యూపీ ఆర్టీసీ బస్సులో ఆగస్టు 13వ తేదీ రాత్రి రెండున్నర గంటలకు డెహ్రాడూన్ చేరుకుంది. అప్పుడు ఐఎస్బీటీ స్టేషన్లో ఉన్న బాధితురాలు అక్కడికి వచ్చిన ఎర్ర రంగు బస్సు యూపీ ఆర్టీసీకి చెందినది అనుకుని ఎక్కింది. బాధితురాలు ఒంటరిగా కనిపించడంతో ఐదుగురు వ్యక్తులు ఆమెపై బస్సులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను బస్సు నుంచి దించేసి దుండగులు పరారయ్యారు అని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు తెలిపారు.
టీనేజర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడినవారిపై కేసు నమోదు చేశామని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజయ్ సింగ్ తెలిపారు. ఐస్ఎస్బీసీ సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారని చెప్పారు. నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేస్తామని తెలిపారు.












Click it and Unblock the Notifications