దొంగతనానికి వెళ్లి కిచిడీ వండుకున్న దొంగ .. ఆపై ఏం జరిగిందంటే

దొంగతనానికి యత్నించిన దొంగ ఆ పని మానేసి కిచిడీ చేస్తే ఏమవుతుంది. మీరు ఊహించిందే జరుగుతుంది. అస్సాం రాష్ట్రంలో ఓ ఆసక్తికరమైన దొంగతనంలో దొంగ దొంగతనం మరిచిపోయి కిచిడి వండాడు. అడ్డంగా పోలీసులకు పట్టుబడ్డాడు. అసలు విషయానికి వస్తే

గౌహతిలోని హెంగేరాబరి ప్రాంతంలో ఓ దొంగ దొంగతనానికి వెళ్ళి షాకింగ్ పని చేశాడు. ఒక ఇంటిపై రెక్కీ వేసి ఎవరూ లేరని తెలుసుకుని ఇంట్లోకి చొరబడిన దొంగ వెళ్ళిన పని మరచిపోయాడు. ఇంటి యజమానులు లేని సమయంలో ఇంట్లో చొరబడిన దొంగ దొంగతనం మరచిపోయి కిచిడీ వండడం ప్రారంభించాడు. ఆ ఇంట్లో కిచెన్ లోకి వెళ్లి అక్కడ ఉన్న పప్పులను చూసి కిచిడీ వండే పనిలో పడ్డాడు. ఇరుగుపొరుగు వారు అతని ఉనికిని గమనించి ఆ ఇంటి యజమానులు లేరని గుర్తించారు.

A Thief In Assam Cooks Khichdi In The Middle Of Burglary, Guwahati Police Arrested

దొంగ ప్రవేశించిన ఇంట్లోని వంటగది నుండి శబ్దాలు వినిపించడంతో ఇంటి యజమానులు దూరంగా ఉన్నారని తెలుసుకున్న ఇరుగుపొరుగు వారు దొంగపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు దొంగను పట్టుకున్నారు. దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ చేసిన పనికి పోలీసులు కూడా నవ్వుకున్నారు. వింత దొంగ చేసిన దోపిడీ ప్రయత్నాన్ని అస్సాం పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గౌహతిలో దొంగను పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించిన అస్సాం పోలీసులు సంఘటన వివరాలను మంగళవారం ట్విట్టర్‌లో వెల్లడించారు.

ఇది కిచిడీ దొంగ యొక్క ఆసక్తికరమైన కేసు అని అస్సాం పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు . అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, దొంగతనానికి ప్రయత్నించినప్పుడు కిచిడీ వండటం మీ శ్రేయస్సుకు హాని కలిగించవచ్చు అంటూ పేర్కొన్నారు పోలీసులు. దొంగను అరెస్టు చేసిన గౌహతి పోలీసులు ఇప్పుడు అతనికి జైల్లో తమదైన శైలిలో వేడి వేడి భోజనం అందిస్తున్నారు. దొంగ వండిన కిచిడీ మాట అటుంచి పోలీసులకు చిక్కి కిచిడీ అయ్యాడని ఈ ఘటన తెలిసిన వారు నవ్వుకుంటున్నారు. కొందరైతే దొంగకు దొంగతనం చేసే సమయంలో ఆకలేసి ఉంటుంది అని సెటైర్లు వేస్తున్నారు. అయ్యోపాపం అంటూ దొంగ మీద సానుభూతి చూపిస్తున్నారు కొందరు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+