శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కారు బ్యాట్, బంతి: సచిన్‌కు తెలుగోడి వీడ్కోలు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ తన ఆఖరు, 200వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానుల దృష్టి అంతా అతని పైనే ఉంది. వెస్టిండీస్‌తో గురువారం ఆరంభమైన రెండవ, చివరి టెస్టు మ్యాచ్ మొదటి రోజు వాంఖడే స్టేడియం మొత్తం సచిన్ నామస్మరణతో మార్మోగింది.

ఫీల్డింగ్ చేసేందుకు అతను మైదానంలోకి అడుగుపెట్టిన వెంటనే వేలాది మంది ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లతో స్వాగతం పలికారు. సచిన్ బంతిని ఆపిన ప్రతిసారీ ప్రేక్షకుల హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. అతను ఎక్కడ ఫీల్డింగ్ చేస్తే, అక్కడి స్టాండ్స్‌లో ప్రేక్షకులు పెద్దపెట్టున సచిన్.. సచిన్.. అంటూ కేకలు పెట్టారు.

ఓపెనర్లు మురళీ విజయ్, శిఖర్ ధావన్ బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ, వీరు ఎప్పుడు అవుటారో, సచిన్ ఎప్పుడు బ్యాటింగ్‌కు వస్తాడోనని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. మొదట ధావన్ అవుట్‌కాగా, ఆతర్వాత మురళీ విజయ్ పెవిలియన్ చేరాడు. అతను అవుటైన వెంటనే మైదానానికి దండం పెడుతూ, అకాశంలోకి చూస్తూ సచిన్ బ్యాటింగ్‌కు దిగాడు. అందరూ ఊహించిన విధంగానే విండీస్ ఆటగాళ్లంతా ఒక వరుసలో నిలబడి అతనికి ఆహ్వానం పలికారు. సచిన్‌కు మన రాష్ట్రంలో అభిమానులు తమదైన పద్ధతుల్లో వీడ్కోలు పలుకుతున్నారు.

సచిన్ 1

సచిన్ 1

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఆఖరి, 200వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో అభిమానులు ఘనంగా వీడ్కోలు పలుకుతున్న దృశ్యం.

సచిన్ 2

సచిన్ 2

లక్షణ నటుడిగా పేరు సంపాదించుకొని, దేశవిదేశాల్లో కోట్లాది మంది అభిమానుల నీరాజనాలు అందుకుంటున్న బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్‌కు క్రికెట్ అంటే వల్లమాలిన అభిమానం. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్ అంటే మరీ ఇష్టం.

సచిన్ 3

సచిన్ 3

సచిన్ బ్యాటింగ్‌ను చూసేందుకు అమీర్ గురువారం ఎంతో కీలకమైన సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌ను వదిలేసి, వైఆర్‌ఎఫ్ స్టూడియో నుంచి వాంఖడే స్టేడియానికి వచ్చాడు.

సచిన్ 4

సచిన్ 4

వాస్తవానికి ఆ ఈవెంట్ గురువారం సాయంత్రం 4.30 గంటలకు ఆరంభం కావాల్సి ఉండింది. ధూమ్ మచాలే పాటను ఈ కార్యక్రమంలోనే సచిన్‌కు అమీర్ అంకితం ఇవ్వాలి.

సచిన్ 5

సచిన్ 5

అప్పటి వరకూ ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తున్న అమీర్‌కు రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ ఆలౌటైందన్న వార్త తెలిసింది. టీమిండియా బ్యాటింగ్‌కు దిగనున్న సమాచారాన్ని అందుకున్న వెంటనే అతను కార్యక్రమాన్ని ఆరు గంటలకు వాయిదా వేయాల్సిందిగా నిర్మాత ఆదిత్య చోప్రాను కోరి, వాంఖడే స్టేడియానికి వెళ్లాడు.

సచిన్ 6

సచిన్ 6

రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ప్రముఖ కారు డిజైనర్ సుధాకర్ యాదవ్ తన అభిమాన క్రికెటర్ సచిన్‌కు వినూత్నరీతిలో వీడ్కోలు పలుకుతున్నారు.

సచిన్ 7

సచిన్ 7

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న దృశ్యం కళ్ల ముందు కదలాడడంతో ప్రేక్షకులు ఉప్పొంగిపోయారు. వెస్టిండీస్‌తో గురువారం ఆరంభమైన రెండవ, చివరి టెస్టు మ్యాచ్ మొదటి రోజు వాంఖడే స్టేడియం మొత్తం సచిన్ నామస్మరణతో మార్మోగింది.

సచిన్ 8

సచిన్ 8

సచిన్ ఫీల్డింగ్ చేసేందుకు వాంఖేడే మైదానంలోకి అడుగుపెట్టిన వెంటనే వేలాది మంది ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లతో స్వాగతం పలికారు.

సచిన్ 9

సచిన్ 9

సచిన్ బంతిని ఆపిన ప్రతిసారీ ప్రేక్షకుల హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. అతను ఎక్కడ ఫీల్డింగ్ చేస్తే, అక్కడి స్టాండ్స్‌లో ప్రేక్షకులు పెద్దపెట్టున ‘సచిన్ సచిన్' అంటూ కేకలు పెట్టారు.

సచిన్ 10

సచిన్ 10

తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ తక్కువ స్కోరుకే కుప్పకూలగా, భారత్ మొదటి ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు మురళీ విజయ్, శిఖర్ ధావన్ బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ, వీరు ఎప్పుడు అవుటారో, సచిన్ ఎప్పుడు బ్యాటింగ్‌కు వస్తాడోనని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు.

సచిన్ 11

సచిన్ 11

మొదట ధావన్ అవుట్‌కాగా, ఆతర్వాత మురళీ విజయ్ పెవిలియన్ చేరాడు. అతను అవుటైన వెంటనే మైదానానికి దండం పెడుతూ, అకాశంలోకి చూస్తూ సచిన్ బ్యాటింగ్‌కు దిగాడు.

సచిన్ 12

సచిన్ 12

సచిన్ బ్యాటింగ్ చేస్తున్నంత సేపూ స్టేడియంలో మరోసారి అతని పేరుతో మార్మోగింది. 38 పరుగులతో నాటౌట్‌గా ఉన్న సచిన్ మ్యాచ్ రెండోరోజు, శుక్రవారం సెంచరీ సాధించాలని ఆశిస్తున్న అభిమానులు తెల్లవారక ముందే వాంఖడే స్టేడియం ముందు బారులు తీరారు.

సచిన్ 13

సచిన్ 13

రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ప్రముఖ కారు డిజైనర్ సుధాకర్ యాదవ్ తన అభిమాన క్రికెటర్ సచిన్‌కు వినూత్నరీతిలో వీడ్కోలు పలుకుతున్నారు. ఆయన పెద్ద బ్యాట్‌ను, బంతిని కారుగా రోడ్డుపై ప్రదర్శించారు.

English summary
A tribute to the cricket legend! Sudhakar Yadav Popular Car designer made Bat and Boll Car to pay tribute to the cricket legend Sachin Tendulkar at Bhadurpure in old city of Hyderabad on Thursday.
 
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X