Melanistic tiger: వైరల్ అవుతోన్న మెలస్టిక్ పులి.. ఎక్కడ ఉందంటే..!
దేశంలో పులల సంఖ్య నానాటికి తగ్గిపోతోంది. దీంతో ప్రభుత్వం పులుల సంరక్షణకు చర్యలు చేపట్టింది. అయితే పులులు సాధారణంగా ఎలా ఉంటాయి.. శరీరంపై నల్లటి చారులు ఉంటాయి. అయితే మనకు తెలియి పులి కూడా ఉంది. అదే మెలనిస్టిక్ పెద్దపులి. ప్రస్తుతం ఈ పులికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మెలనిస్టిక్ టైగర్ చర్మం పై డార్క్ పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇది అరుదుగా ఉంటుంది.
ఇప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే.. మెలస్టిక్ పులి భారత్ లో కనిపించింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి రమేష్ పాండే ఈ మెలనిస్టిక్ టైగర్ వీడియోను ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఒడిశాలోని సిమిలిపాల్ టైగర్ రిజర్వ్‌లో ఈ పులి కనిపించింది. "ఒడిశాలోని సిమిలిపాల్ టైగర్ రిజర్వ్‌లోని మెలనిస్టిక్ టైగర్ అందమైన కెమెరా ట్రాప్ వీడియో, జనాభాలో జన్యు ఉత్పరివర్తనాల కారణంగా నల్లటి పులులను మనం చూసే ఏకైక ప్రదేశం" అని ట్వీట్ చేశారు.

రమేష్ పాండే ఈ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకు 66,000 వ్యూస్ వచ్చాయి. 1,600కు పైగా లైక్‌లు కూడా వచ్చాయి. చాలామంది ఈ వీడియోపై కామెంట్ చేశారు. ఈ వీడియో పోస్ట్ చేసి సమాచారం అందించినందుకు ధన్యవాదాలు అని ఒకరు, ఈ పులి గురించి మొదటిసారి వింటున్నాన అని మరొకరు కామెంట్ చేశారు. మెలనిస్టిక్ టైగర్? వావ్, అతని/ఆమె చర్మంపై నల్లటి మచ్చలు ఉన్న పులిని నేను ఎప్పుడూ చూడలేదని ఒకరు కామెంట్ చేశారు.
Beautiful camera trap video of a melanistic tiger in Similipal Tiger Reserve, Odisha, the only place where we see blackish tigers because of genetic mutations in the population. pic.twitter.com/KXqvjX8tvs
— Ramesh Pandey (@rameshpandeyifs) August 1, 2023
భారత్ లో 2022లో పులుల గణన చేపట్టారు. ఈ నివేదిక ప్రకారం భారత్ లో పులుల సంఖ్య పెరిగింది. 2006లో పులుల సంఖ్య 1411 ఉండగా.. 2022 వరకు 3,167 పులులు ఉన్నాయి. 2018లో పులుల గణన నివేదిక ప్రకారం 2,967 పులులు ఉంటే.. తాజా నివేదిక ప్రకారం 200 పెరిగాయి. భారతదేశంలో పులుల సంరక్షణ అభయారణ్యాలను శివాలిక్ కొండలు గంగ మైదానం, మధ్య భారతదేశం తూర్పు కనుమలు, ఈశాన్య పర్వతాలు బ్రహ్మపుత్ర మైదానాలు, సుందర బన్స్ మైదానాలు, పశ్చిమ కనుమలు అనే ఐదు భాగాలుగా ఏర్పరిచారు.












Click it and Unblock the Notifications