
Viral Video: గన్‍తో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి హల్‍చల్.. వీడియో వైరల్..
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి జోగిందర్ సింగ్ పిస్టల్ పట్టుకుని డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతనిపై ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కూడా మొదలు పెట్టారు. ఈ వీడియోలో జోగిందర్ సింగ్ పసుపు రంగు టీ-షర్ట్ ధరించి, కొంతమంది వ్యక్తులతో కలిసి డ్యాన్స్ చేస్తున్నప్పుడు పిస్టల్ ఊపుతున్నట్లు కనిపించింది.
డిసెంబర్ 4న 250 వార్డులకు జరుగునున్నాయి. డిసెంబర్ 7న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ తరుణంలో ఆప్ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థి ఇలా తుపాకీతో హల్‌చల్ చేయడంతో పార్టీ శ్రేణులంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. జోగిందర్ సింగ్ పిస్టోల్ తో డ్యాన్స్ చేస్తున్న వీడియోను బీజేపీ ట్వీట్ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల నిజస్వరూపాన్ని ఈ వీడియో తెలియజేస్తోందని బీజేపీ గతంలో పేర్కొంది. ప్రస్తుతం ఎంసీడీలో బీజేపీ అధికారంలో ఉండగా, మునిసిపల్ బాడీలో దూసుకుపోవాలని ఆప్ ప్రయత్నిస్తోంది.
यह लीजिए मिलिये - Revolver Dance करते @ArvindKejriwal के सिपाही Joginder Singh से जो Ward 19 से @AamAadmiParty प्रत्याशी हैं।
— Praveen Shankar Kapoor (@praveenskapoor) November 28, 2022
आप सोच सकते हैं की -- यह Revolver धारी अगर पार्षद बने तो कैसी जनसेवा करेंगे ?@BJP4Delhi @ManojTiwariMP @neelkantbakshi @gauravkharibjp @rohitTeamBJP pic.twitter.com/7EPKssLMMY
