వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral Video: పాఠశాల విద్యార్థులతో టాయిలెట్లు గడిగించిన ఉపాధ్యాయులు.. వైరల్ అయిన వీడియో..

|
Google Oneindia TeluguNews

విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకోవాల్సిన ఉపాధ్యాయులు వారితో టాయిలెట్లను కడిగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్ణాటకలోని గడగ్ జిల్లాలోని పాఠశాల విద్యార్థులు నాగవి పాఠశాలలో టాయిలెట్‌ను శుభ్రం చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ వంట మనిషి షేర్ చేసినట్లు సమాచారం.

6, 7వ తరగతి విద్యార్థులు..

6, 7వ తరగతి విద్యార్థులు..


జులై 12న విజయలక్ష్మి చలవాడి అనే వంటమనిషి ఈ వీడియోను చిత్రీకరించారు. ఈ సంఘటన గడగ్‌లోని నాగవిలోని ప్రభుత్వ ప్రాథమిక మరియు ఉన్నత ప్రాథమిక పాఠశాలలో జరిగింది. 6, 7వ తరగతి విద్యార్థులు పాఠశాల మరుగుదొడ్లను శుభ్రం చేస్తున్న చిత్రాలు, వీడియోలు వెలుగులోకి రావడంతో గడగ్‌లోని విద్యాశాఖ విచారణకు ఆదేశించింది.

బకెట్, చీపురు కోసం..

బకెట్, చీపురు కోసం..


సమయానికి రానందుకు శిక్షగా మరుగుదొడ్లను శుభ్రం చేయాలని పాఠశాల యాజమాన్యం కోరిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై విద్యాశాఖ విచారణ జరుపుతోందని తెలిపారు. "నేను పాఠశాలలో ఉన్నప్పుడు, టాయిలెట్ శుభ్రం చేయడానికి విద్యార్థులు బకెట్, చీపురు కోసం నన్ను సంప్రదించారు. ఉపాధ్యాయులు అలా చేయమని అడిగారని విద్యార్థులు నాకు చెప్పారు." అని వంట మనిషి చెప్పింది.

వంట మనిషిపై అధికారుల ఆగ్రహం..

వంట మనిషిపై అధికారుల ఆగ్రహం..


"ఇది సరైనది కాదని నేను అనుకున్నాను.నేను టాయిలెట్ క్లీన్ చేస్తున్న దృశ్యాలను రికార్డ్ చేశాను. ఆ వీడియోను వాట్సాప్‌లో షేర్ చేశాను" అని విజయలక్ష్మి చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక నివేదికలో పేర్కొంది. వీడియో వైరల్ కావడంతో, వీడియోను షేర్ చేసినందుకు వంట మనిషి సీనియర్ అధికారుల ఆగ్రహానికి గురైంది.

English summary
In a shocking incident reported from Gadag district of Karnataka, school students were seen cleaning the toilet at Nagavi school.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X