Viral Video: ఈ బాలుడికి పతకం పక్కా.. వైరల్ అవుతున్న ఆనంద్ మహీంద్రా ట్వీట్..
కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ ప్రదర్శనపై ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఆయన తాజాగా చేసిన ట్వీట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోతోపాటు #CWG2022లో భారతదేశం కోసం గోల్డ్ రష్ తర్వాత తదుపరి తరం ప్రతిభావంతులు రూపుదిద్దుకుంటున్నారని రాసుకొచ్చారు. ఈ టాలెంట్‌ని ఫాస్ట్ ట్రాక్‌లోకి తీసుకురావాలి. (తిరునెల్వేలి సమీపంలోని ఒక గ్రామంలో ఈ అబ్బాయిని చూసిన స్నేహితుడు ఈ వీడియోను పంచుకున్నాడు)" అని మహీంద్రా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
Recommended Video


నెట్ లేకుండానే..
వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకు ఇప్పటికే 28 వేలకుపైగా వ్యూస్ వచ్చాయి. లైక్ లు, రీట్వీట్లు కూడా ఉన్నాయి. ఈ వీడియోలో ఓ బాలుడు జిమ్నాస్టిక్ మాములుగా చేయడం లేదు. అతనికి ఎలాంటి నెట్ లేకున్నా అలవోకగా జంప్ లు చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు. ఈ వీడియో తమిళనాడులోని తిరునెల్వేలి సమీపంలోని ఒక గ్రామంలో తీసింది.

శిక్షణ ఇవ్వాలి..
ఈ వీడియోపై నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. బాలుడి జంప్ లు చూసి. ఇతడు కచ్చితంగా పతకాలు గెలుస్తాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ బాలుడిని గుర్తించి మంచి శిక్షణ ఇస్తే భారత్ మంచి పేరు తీసుకొస్తాడని మరొకు కామెంట్ చేశారు.

షూటింగ్ లేదు..
కామన్వెల్త్‌లో భారత్ 22 బంగారు, 15 రజత, 23 కాంస్య పతకాలతో పాటు మొత్తం 61 పతకాలతో పతకాల పట్టికలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. 2010లో స్వదేశంలో ఆటలు జరిగినప్పుడు మొత్తం 101 పతకాలు సాధించి భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. అయితే ఈసారి ఆటల్లో షూటింగ్ లేదు ఒకవేళ ఉంటే భారత్ మరిన్ని పథకాలు సాధించేది.
And after the Gold rush for India at the #CWG2022 the next generation of talent is shaping up. Unsupported. We need to get this talent on the fast track. (This video shared by a friend who has seen this boy in a village near Tirunelveli) pic.twitter.com/DXBcGQjMX0
— anand mahindra (@anandmahindra) August 9, 2022












Click it and Unblock the Notifications