వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళా మావోయిస్టు పూనం దేవి అరెస్టు

|
Google Oneindia TeluguNews

పాట్నా: అనేక సంవత్సరాల నుండి తప్పించుకుని తిరుగుతున్న మహిళా మావోయిస్టును ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. పూనం దేవి అనే మహిళా మావోయిస్టును అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఈమె పోలీసులకు ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు.

గయ జిల్లా ఎస్పీ మను మహరాజ్ కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఏరియా కమాండర్ జైకరణ్ యాదవ్ ను పూనం దేవి వివాహం చేసుకుంది. తరువాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయి మావోయిస్టు కార్యకలాపాలకు పాల్పడింది.

A wanted woman Maoist holding a cash award of Rs 50,000 on her head

2002వ సంవత్సరంలో రోహతన్ డీఎఫ్ఓ సంజయ్ సింగ్ ను పూనం దేవి దారుణంగా హత్య చేసింది. ఈ కేసులో ఆమె ప్రధాన నిందితురాలు. అప్పటి నుండి పూనం దేవి కోసం పోలిసులు గాలిస్తున్నారు. అయితే పూనం దేవి ఆమె భర్త జైకరణ్ తో సంబంధాలు తెంచుకుంది.

తరువాత పూనం దేవి తలయ్యా గ్రామానికి చేరుకుని అక్కడే ఉన్న వేరే వ్యక్తితో కలిసి జీవనం సాగిస్తున్నది. ఈమె తల మీద రూ. 50 వేలు రివార్డు ప్రకటించారు. అప్పటి నుండి ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. కచ్చితమైన వివరాలు సేకరించిన పోలీసులు తలయ్యా గ్రామానికి చేరుకుని పూనం దేవిని అరెస్టు చేశారు.

English summary
Gaya Senior Superintendent of Police Gaya Manu Maharaj said the Maoist Poonam Devi was arrested from her native Talaiya village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X