మోఢీనే ఆయనను ఫాలో అవుతున్నాడు, కారణమిదే
మంచి ఆశయం, చక్కని ఆచరణ ఉంటే అందరి మన్ననలను పొందవచ్చని నిరూపించారు కర్ణాటక రాష్ట్రానికి చెందిన యువ పారిశ్రామిక వేత్త ఆకాష్ జైన్.
బెంగుళూరు: మంచి ఆశయం, చక్కని ఆచరణ ఉంటే అందరి మన్ననలను పొందవచ్చని నిరూపించారు కర్ణాటక రాష్ట్రానికి చెందిన యువ పారిశ్రామిక వేత్త ఆకాష్ జైన్.
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అంటే ఆయన చాలా ఇష్టపడతాడు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ట్విట్టర్ లో 1700 మందిని ఫాలో అవుతున్నారు.తాను అభిమానించేవారి ట్విట్టర్లను మోడీ ఫాలో అవుతున్నారు.కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరుకు చెందిన యువ పారిశ్రామికవేత్త ఆకాష్ జైన్ ట్విట్టర్ ను మోడీ ఫాలో అవుతున్నారు.
ఆకాష్ ఎందుకు ఫాలో అవుతున్నారంటే?
ఆకాష్ జైన్ ను ప్రధాని మోడీ ఎందుకు ఫాలో అవుతున్నారంటే ఓ మంచి నిర్ణయాన్ని అమలు చేసినందుకు మోడీ ఆయనను ఫాలో అవుతున్నారు.

ఆకాష్ సోదరి వివాహనికి ఆహ్వానించేందుకు ముద్రించిన శుభలేఖలపై స్వఛ్చభారత్ లోగోను ముద్రించారు ఆకాష్ జైన్. ఆ శుభలేఖను ట్విట్టర్ లో పోస్ట్ చేసి మోడీకి ట్యాగ్ చేశాడు.ప్రియమైన నరేంద్ర మోడీ , మా నాన్న గారు నా సోదరి వివాహ శుభలేఖపై ప్రత్యేకంగా స్వచ్చ భారత్ లోగో ఉండాలని చెప్పారు అందుకే ముద్రించాం అని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.
ఈ పోస్టు చూసిన చాలా మంది బిజెపి నేతలు రీట్వీట్ చేసి ఆకాష్ ను ప్రశంసించారు.నరేంద్రమోడీ కూడ రీట్వీట్ చేశారు. అక్కటితో ఆగకుంండా ఆకాష్ కు ఫాలోవర్ గా మారిపోయారు మోడీ.తనను మోడీ ఫాలో కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ శుభలేఖను యధాలాపంగానే మోడీకి ట్వీట్ చేశానని చె ప్పారు. అయితే ఆయన స్పందిస్తారని ఊహించలేదన్నారు. భారీ సంఖ్యలో ఫాలోవర్లున్న వ్యక్తి తనను ఫాలో అవడం కన్నా గొప్ప ఏముంటుందంటున్నారు ఆకాష్.












Click it and Unblock the Notifications