మూడేళ్లు సహజీవనం.. ఆపైన మోసం, ఎంపీ కుమారుడే ఇలా.., రేడియో జాకీ ఫిర్యాదు
చెన్నై: అన్నాడీఎంకే ఎంపీ కుమారుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. మూడేళ్లు తనతో సహజీవనం చేసి, మోజు తీరాక మోసం చేశాడని, తనను కాదని మరో మహిళను వివాహం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఓ రేడియో జాకీ చెన్నై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళితే... అన్నాడీఎంకే ఎంపీ అన్వర్ రాజా కొడుకు నాజర్ అలీపై రేడియో జాకీ రెబినా అనే మహిళ చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. ఓ ఓ వివాహ కార్యక్రమంలో నాజర్‌అలీతో తనకు ఏర్పడిన పరిచయం అనంతరం తమిద్దరి మధ్య ప్రేమగా మారినట్టు ఆమె తన ఫిర్యాదులో తెలిపింది.

అంబిక అనే మహిళను గతంలో వివాహం చేసుకున్న నాజర్‌కు ఓ కుమారుడు కూడా ఉన్నాడని, వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారని, ఆ తర్వాత ఒంటరివాడైన నాజర్ అలీ తనతో సహజీవనం చేశాడని రెబీనా పేర్కొంది.
18 ఏళ్ల వయసులోనే భర్తను పోగొట్టుకున్న తానూ ఒంటిరిగా ఉండటంతో ఆ పరిస్థితుల్లో తోడు కోసం ఎదురుచూస్తున్న తాను, నాజర్ చట్టప్రకారం వివాహం చేసుకోకుండానే సహజీవనం చేశామని వివరించింది. దీనికి సంబంధించి తాము ఇద్దరమూ తిరిగిన ప్రదేశాలు, కలిసి తీసుకున్న ఫొటోలే ఆధారాలని, అవి తనవద్దే ఉన్నాయని స్పష్టం చేసింది.
అయితే ఇప్పుడు తనను కాదని.. తనకు తెలియకుండా ఆదివారం కారైకుడిలో మరో మహిళను వివాహం చేసుకునేందుకు నాజర్ అలీ సిద్ధమయ్యాడని, దీన్ని అడ్డుకోవాలని బాధితురాలు రెబీనా తన ఫిర్యాదులో పేర్కొంది. తాను మాట్లాడటానికి ప్రయత్నిస్తే నిరాకరించాడని, నీకు చేతనైంది చేసుకో అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడాడని తెలిపింది.












Click it and Unblock the Notifications