fb love:భర్త, పిల్లలను వదిలి ప్రియుడి వద్దకు, విగతజీవిగా మారిన వివాహిత

ఆమెకు పెళ్లయ్యింది. భర్త ఉన్నాడు. బంగారం లాంటి పిల్లలు ఉన్నారు. భర్తతో దూరంగా ఉంటోంది. ఇంతలో ఆమె బుద్ది తప్పింది. సోషల్ మీడియా వేదిక.. ఒకతనితో ప్రేమాయణం సాగించింది. అతను పిలిచాడని అందిరినీ వదిలి వెళ్లింది. చివరకు విగతజీవిగా మారింది. అవును ప్రేమించిన ప్రియుడే ఆమెను కడతేర్చాడు. ఈ విషాద ఘటన ఇందూరు జిల్లాలో జరిగింది.

భర్త, పిల్లలు.. కానీ

భర్త, పిల్లలు.. కానీ

నిజామాబాద్ జిల్లా బాన్స్‌వాడకు చెందిన వివాహిత ఉస్మాభేగం, ముఖిద్‌తో పెళ్లయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భార్య భర్తల మధ్య గొడవ జరగడంతో.. ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. అయితే ఆ సమయంలో ఉస్మా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఉత్తరప్రదేశ్ అమ్రేహ జిల్లాకు చెందిన హెజాద్‌తో పరిచయం అయ్యింది. అలా వార్ చాట్ చేయడంం.. క్రమంగా అదీ ప్రేమగా మారింది. అతని మాటలు నమ్మి.. ఈ నెల 6వ తేదీన కలువడానికి వెళ్లింది.

ఏకాంత ప్రదేశంలో

ఏకాంత ప్రదేశంలో

ఉస్మాను తాను పనిచేసే సెక్యూరిటీ కంపెనీ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరు ఏకాంతంగా గడిపారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని ఉస్మా కోరింది. దానికి అతను నిరాకరించాడు. దీనిపై ఇద్దరికీ మాట మాట పెరిగింది.ఉస్మాను చున్నీతో కట్టి.. చేతిలో ఉన్న ఇటుకతో తలపై కొట్టాడు. రక్త తీవ్రంగా కారి.. చనిపోయింది. అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నాడు.

3 రోజుల తర్వాత

3 రోజుల తర్వాత

మూడు రోజుల తర్వాత వాసన వచ్చింది. మృతదేహాన్ని గుర్తించి గాజరావుల పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాం వద్ద లభించిన ఆధారాలను బట్టి ఆమెను నిజామాబాద్ జిల్లాకు చెందినవారీగా గుర్తించారు. అప్పటికే బాన్స్ వాడలో మిస్సింగ్ కేసు నమోదైంది. అక్కడి పోలీసులు మృతికి సంబంధించిన విషయం గురించి సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు యూపీ వెళ్లారు.

విగతజీవిగా మారి

విగతజీవిగా మారి


అప్పటివరకు చక్కగా ఉన్న ఆ కుటుంబం.. ప్రియుడు ప్రవేశించడంతో చీకటిగా మారింది. భర్త, పిల్లలను వదిలి విగతజీవిగా మారింది. సో.. సోషల్ మీడియా వేదికగా.. ఫ్రెండ్ షిప్ అంత మంచిది కాదు. ఉస్మా ఘటనతో మరోసారి రుజువు అయ్యింది. సో.. మిగతా వారు అయినా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+