మొదటి భర్త అనుమతితో లవర్‌తో వివాహం: పోలీసులకు ఫిర్యాదు, ఏమైందంటే?

Posted By:
Subscribe to Oneindia Telugu

పాట్నా: మొదటి భర్త అనుమతితో తన ప్రియుడిని భార్య వివాహం చేసుకొన్న ఘటన బీహర్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. అయితే ఈ ఘటనపై మొదటి భర్త కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే తన మొదటి భర్త అనుమతితోనే వివాహం చేసుకొన్నట్టు నవ వధువు తెలిపారు. అయితే ఇరువర్గాలకు నచ్చజెప్పి పోలీసులు పంపించారు.

ఉపాధి కోసం భార్యకు దూరంగా భర్త ఉంటున్నాడు తన కుటుంబ పోషణ కోసం భర్త సౌదీకి వెళ్ళాడు. రెండేళ్ళ క్రితం ఆయన సౌదీలో ఉంటున్నాడు. అయితే భార్య, పిల్లలతో కలిసి భర్త ఇంట్లోనే ఉంటుంది.

అయితే భర్త దూరంగా ఉండడంతో పాటు స్థానికంగా ఉన్న మరో వ్యక్తితో ఆమె ప్రేమలో పడింది. వారిద్దరి వ్యవహరం భర్త కుటుంబసభ్యులకు కూడ తెలిసింది. దీంతో వారు ఆమెను మందలించారు. అయితే ఆమె తన ఇష్టప్రకారం చేయాలని నిర్ణయానికి వచ్చింది.

 భర్త అనుమతితోనే వివాహం

భర్త అనుమతితోనే వివాహం

సౌదీలో నివాసం ఉంటున్న భర్తకు తన ప్రేమ వ్యవహరాన్ని భార్య చెప్పింది. అయితే తన విషయాన్ని వివరించిన తర్వాత భర్త కూడ అంగీకరించిందని ఆమె చెప్పారు.దీంతో ఆమె తన ప్రియుడిని రెండో వివాహం చేసుకొంది.

వివాహితపై మొదటి భర్త కుటుంబసభ్యుల ఫిర్యాదు

వివాహితపై మొదటి భర్త కుటుంబసభ్యుల ఫిర్యాదు

వివాహితపై మొదటి భర్త కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. భర్త ఉండగానే మరో వ్యక్తిని వివాహం చేసుకొందని ఆమెపై మొదటి భర్త కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ విషయమై తనకు మొదటి భర్త అనుమతి ఉందని నవవధువు పోలీసులకు చెప్పింది.

ప్రియుడితో రాసలీలలు, రెడ్ హ్యండెడ్‌గా పట్టుకొన్న భర్త, ఏమైందంటే?

మొదటి భర్త ఇంటి వద్ద పిల్లలుత

మొదటి భర్త ఇంటి వద్ద పిల్లలుత

మొదటి భర్తతో తనకు కలిగిన పిల్లలకు తనతో తీసుకెళ్ళలేదు. మొదటి భర్త ఇంటి వద్దనే వధువు వదిలేసింది. అయితే మొదటి భర్త అంగీకారం మేరకే పిల్లలను అక్కడ వదిలేసినట్టు ఆమె పోలీసులకు చెప్పారు.

ప్రియురాలికి రూ.2 కోట్లు, భార్యకు విడాకులు, ట్విస్టిచ్చిన లవర్...

ఇరువర్గాలకు నచ్చచెప్పిన పోలీసులు

ఇరువర్గాలకు నచ్చచెప్పిన పోలీసులు

ఈ విషయమై రెండు వర్గాలు పోలీసుస్టేషన్‌కు చేరాయి. అయితే ఈ కేసు విషయంలో ఇద్దరి వాదనలు విన్న పోలీసులు ఏం చేయాలో అర్ధం కాకపోవడంతో ఇరువర్గాలకు నచ్చజెప్పి పంపించేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Woman married lover with the permission of first husband in Bihar state. first husband parents complained to police

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి