జేసీబీ డ్రైవర్ల పైశాచికత్వం: యువతి కిడ్నాప్..రెండు రోజుల పాటు గ్యాంగ్‌రేప్
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని మరో అమానవీయ ఉదంతం చోటు చేసుకుంది. హత్రాస్ ఘటన సృష్టించిన రాజకీయ వేడి చల్లారక ముందే.. మరో దారుణం సంభవించింది. దళిత యువతిని అపహరించిన ఇద్దరు వ్యక్తులు.. ఆమెను నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు. రెండు రోజుల పాటు ఆమెపై పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. బాధితురాలికి న్యాయం చేయాల్సిన పోలిసులు లంచం తీసుకుని కేసును పక్కదారి పట్టించడానికి ప్రయత్నించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఉత్తర ప్రదేశ్‌లోని బారాబాంకి జిల్లాలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. బారాబాంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుబేహా గ్రామానికి చెందిన ఓ యువతిని రెండురోజుల కిందట ఇద్దరు జేసీబీ ప్రొక్లెయినర్ డ్రైవర్లు అపహరించారు..నిర్బంధించారు. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. వారిద్దరినీ పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే రోడ్డును నిర్మించే ఓ ప్రైవేటు సబ్ కాంట్రాక్ట్ సంస్థకు చెందిన సిబ్బందిగా గుర్తించారు. సుబేహా గ్రామం మీదుగా ఈ ఎక్స్‌ప్రెస్ వేను నిర్మిస్తున్నారు.

నిర్మాణ పనుల్లో భాగంగా సుబేహా గ్రామం సమీపంలో మట్టిని తరలించడానికి జేసీబీలను వినియోగిస్తున్నారు. వాటి డ్రైవర్లు అదే గ్రామానికి చెందిన దళిత యువతిని కిడ్నాప్ చేశారు. తమ నివాసంలో ఆమెను నిర్బంధించి, గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడ్డారు. తమ కుమార్తె కనిపించట్లేదంటూ ఆదివారం ఉదయం బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయడానికి పోలీసులు బాధితురాలి కుటుంబ సభ్యుల నుంచి 10 వేల రూపాయల లంచాన్ని అడిగారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ విషయం తన దృష్టికి రావడం బారాబాంకి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అరవింద్ చతుర్వేది జోక్యం చేసుకున్నారు. ఈ కేసును ఆయనే స్వయంగా పర్యవేక్షించారు. కుటుంబ సభ్యుల అనుమానం మేరకు జేసీబీ డ్రైవర్లు ఆరిఫ్, ముదస్సర్‌ను అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా వారు తమ నేరాన్ని అంగీకరించినట్లు చతుర్వేది చెప్పారు. నిందితులు రోడ్డు పక్కన తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న నివాసం నుంచి బాధితురాలిని రక్షించారు. అనారోగ్యానికి గురైన ఆమెను ఆసుపత్రికి పంపించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!!












Click it and Unblock the Notifications