ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్, ఏకంగా రూ. 80 లక్షలు ఎగిరిపోయింది, ఒకే దెబ్బతో ?
మీరు ఆన్‌లైన్‌లో ఎలాంటి అర్జీలు అయినా పూర్తి చేసి మీకు కావలసిన సేవల కోసం ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. మునుపటిలాగా సంబంధిత పత్రాలు చేతిలో పట్టుకుని ఆఫీసుల్లో టేబుల్ టేబుల్‌కి తిరగాల్సిన పనిలేదు. ఆధార్ కార్డు కోసం దరఖాస్తుల సమర్పణ, వాటి దిద్దుబాటు, పేరు చేర్చడం మొదలైన ఎన్‌రోల్‌మెంట్‌లకు సంబంధించిన అనేక ప్రభుత్వ సేవలు నేడు ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి.
అయితే దీన్ని కొందరు తమ స్వలాభం కోసం వాడుకుని అమాయకులను మోసం చేస్తున్న ఉదంతాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇలాంటి మోసపూరిత నెట్‌వర్క్‌లో పడిన చండీగఢ్‌కు చెందిన ఓ మహిళ ఏకంగా రూ. 80 లక్షల రూపాయలు పోగొట్టుకుంది. స్థానిక మీడియా నివేదిక ప్రకారం ఆ మహిళ చండీగఢ్ నగరంలోని సెక్టార్ 11 నివాసం ఉంటున్నది. ముంబాయికి చెందిన సైబర్ క్రైమ్ అధికారుల వేషధారణలో ఉన్న నిందితులు ఆ మహిళకు ఫోన్ చేశారు.

ఆధార్ కార్డుతో అనుసంధానం చేసిన మొబైల్ నంబర్ నుంచి అక్రమ నగదు బదిలీ జరిగిందని ఆమెను భయపెట్టారు. ఇప్పటి వరకు 24 సార్లు నల్లధనం బదిలీ అయ్యిందని, త్వరలో మిమ్మల్ని పట్టుకుంటామని, అరెస్టు చేసి జైల్లో పెడుతామని నకిలీ పోలీసులు ఆమెను బెదిరించారు.
ఈ కేసు విచారణ కోసం మాకు మీ పూర్తి పేరుతో పాటు డాక్యుమెంటేషన్ వివరాలు అవసరం కాబట్టి కాల్ చేశామని ఆమెను నమ్మించారు.
పూర్తి సమాచారం ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని అరెస్టు చేయబోమని, మిమ్మల్ని కేసు నుంచి తప్పిస్తామని ఆమెకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత సైబర్ దొంగలు అడిగిన సమాచారాన్ని ఆ మహిళ చెప్పింది. ఆ తర్వాత విచారణలో భాగంగా మేం సూచించిన బ్యాంకు ఖాతాలో రూ. 80 లక్షల రూపాయలు జమ చేయాలని, కేసు విచారణ పూర్తయ్యాక మీ డబ్బు వాపస్ ఇస్తామని నిందితులు ఆమెకు మాయమాటలు చెప్పారు.
అనంతరం సదరు మహిళ మోసగాడి ఖాతాలో డబ్బులు జమ చేసింది. చివరికి మోసోయానని తెలుసుకున్న బాధితురాలు ఛండీగఢ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల బ్యాంక్ అకౌంట్ గుర్తించామని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు. భారత్‌తో పాటు ఆగ్నేయాసియా దేశాల్లో సైబర్ క్రైమ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా సైబర్ దాడి చేసేవారిలో ఎక్కువ మంది లక్ష్యంగా భారత్ ముందువరుసలో ఉంది.












Click it and Unblock the Notifications