రెండో పెళ్లి చేసుకున్న మమ్మి, వీడు అమ్మమ్మ ఇంట్లో ఉంటూ ఏం చేశాడో తెలుసా ?
తిరువనంతపురం/కొచ్చి: కేరళలోని త్రిస్సూర్ జిల్లా వడకేకాడుకు చెందిన అబ్దుల్, జమీల దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ వృద్ధ దంపతులు వారి కుమార్తె మొదటి వివాహం చేసుకున్న తరువాత వీరితోనే కలిసి నివాసం ఉంటున్నది. భర్తతో విడాకులు తీసుకున్న తరువాత ఆమె కొల్లం ప్రాంతంలో నివసిస్తోంది. ఆమెకు మొదటి వివాహం చేసుకున్న తరువాత ఆమె భర్త తో కాపురం చెయ్యడంతో ఓ కుమారుడు ఉన్నాడు.
కుమార్తె రెండవ వివాహం చేసుకున్న తరువాత, అబ్దుల్, జమీలా దంపతులు ఆమె కుమార్తె కుమారుడు అక్మల్ పెంచారు. 28 ఏళ్ల అక్మల్ డ్రగ్స్‌కు బానిసైనట్లు సమాచారం. డ్రగ్స్ వాడుతూ తన సంగతి మరిచిపోయి రోజూ ఇంట్లో అనేక సందర్బాల్లో గొడవలు పడుతూ అతను ఏం చేస్తున్నాడో అతనే మరిచిపోతున్నాడు.

వాళ్ళు మనవడిని వదిలేస్తే ఒంటరిగా మిగిలిపోతాడని ఆవేదన చెందారు. 28 ఏళ్లుగా తాము పెంచి పోషించిన అక్మల్ తమను ఏమీ చేయలేడని ఆ దంపతులు బంధువులకు చెప్పారు. కానీ అక్మల్ డ్రగ్స్ కొనుక్కోవడానికి నిన్నగాక మొన్న తాతను డబ్బులు అడిగాడు. డబ్బులు ఇవ్వడానికి తాత నిరాకరించారు. దీంతో కోపోద్రిక్తుడైన అక్మల్ తనను తాను మరిచిపోయి కత్తితో అవ్వాతాతలను హత్య చేశాడు.

అనంతరం అమ్మమ్మ నగలు చోరీ చేసి అక్కడి నుంచి అక్మల్ పారిపోయాడు. అక్మల్ తన అమ్మమ్మ నగలతో పోలీసులకు పట్టుబడ్డాడు. తర్వాత అమ్మమ్మ, తాతను హత్య చేసినట్లు అక్మల్ ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు నిన్న ఘటన జరిగిన ఇంటికి అక్మల్‌ను తీసుకొచ్చి మరిన్ని ఆధారాలు సేకరించి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. డ్రగ్స్‌కు బానిసై తాతయ్య, అమ్మమ్మలను మనవడు చంపిన ఘటన కేరళలో కలకలకం రేపింది.












Click it and Unblock the Notifications