Wife: వివాహిత మహిళతో యువకుడి అక్రమ సంబంధం, లేడీతో జంప్, పగలే నరికేశారు !
వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టకున్న యువకుడిని పట్టపగలు దారుణంగా నడిరోడ్డులో నరికి చంపేయడం కలకలం రేపింది. అక్రమ సంబంధం పెట్టుకున్న వివాహిత మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
చెన్నై/ తిరునల్వేలి: వివాహిత మహిళతో అక్రమ సంబంధం పెట్టకున్న యువకుడిని పట్టపగలు దారుణంగా నరికి చంపేయడం కలకలం రేపింది. ఆ యువకుడు ఊరికి వస్తున్నాడని పక్కా సమాచారం అందడంతో నడిరోడ్డులో నరికి చంపేశారని పోలీసులు అన్నారు. హత్యకు గురైన యువకుడి బంధులు అందరూ ఒక్కసారిగా గుమికూడటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్రమ సంబంధం పెట్టుకున్న వివాహిత మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

వివాహిత మహిళతో అక్రమ సంబంధం
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలోని కురిచ్చి చెరువు అనే ఊరిలో మరియప్పన్ అనే రైతు నివాసం ఉంటున్నాడు. ఇతనికి వెల్లియప్పన్ (29) అనే కుమారుడు ఉన్నాడు. వెల్లియప్పన్ ముంబాయిలో ఉంటున్నాడు. సి.ఎన్. గ్రామానికి చెందిన ఓ వివాహిత మహిళతో వెల్లియప్పన్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ తరువాత ఆమెను ముంబాయి పిలుచుకుని వెళ్లిపోయాడు.

భర్త వార్నింగ్ ఇచ్చినా పట్టించుకోని ప్రియుడు
తన భార్యతో అక్రమ సంబంధం వదులుకోవాలని మహిళ భర్త వెల్లియప్పన్ కు చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాడని తెలిసింది. అయితే వివాహిత మహిళతో అక్రమ సంబంధాన్ని వదులుకోవడానికి వెల్లియప్పన్ నిరాకరించినట్లు సమాచారం. తరువాత వెలియప్పన్ ముంబాయిలో ఉన్న మహిళను ఊటీ సహా పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లి ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు.

నడిరోడ్డులో నరికి చంపేశారు
వెల్లియప్పన్ కోసం మహిళ బంధువులు వెతికారు. కులలోని సందన మరియమ్మన్ ఆలయంలో పూజలు జరుగుతుండటంతో గుడిలో జరుగుతున్న కార్యక్రమానికి హాజరుకావడానికి వెల్లియప్పన్ స్వగ్రామానికి చేరుకున్నారు. ఇలాంటి సమయం కోసం ఎదురుచూసిన మహిళ కుటంబ సభ్యులు కురిచికుళం-తాహయూతు ప్రధాన రహదారి బైక్ లో వెలుతున్న వెల్లియప్పన్ ను అడ్డగించి పట్టపగలు కొడవళ్లతో దారుణ:గా నరికి చంపేసి పరారయ్యారు.

మేడమ్ ఫ్యామిలీ కోసం వేట
మెడ మీద కొడవళ్లతో నరకడంతో వెల్లియప్పన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి వచ్చిన బంధువులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తిరునల్వేలి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. హత్యకు గురైన వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ, ఆమె బంధువుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications