ఆధార్ ఉంటే విదేశీయులకూ ఓటు..? సుప్రీంకోర్టు షాకింగ్..!

భారత్ లోని వివిధ రాష్ట్రాల్లో, ముఖ్యంగా దేశ సరిహద్దు రాష్ట్రాల్లో అక్రమంగా చొరబడిన విదేశీయులు ఇక్కడ ఆధార్ కార్డు సంపాదించుకుని ఓటు హక్కు కూడా పొందుతుండటంపై సుప్రీంకోర్టు ఇవాళ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇలా ఆధార్ కార్డు ఉంటే చాలా, విదేశీయులైనా ఓటు హక్కు ఉంటుందా అని అత్యున్నత న్యాయస్ధానం ధర్మ సందేహం వ్యక్తం చేసింది. ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ప్రశ్న వేసింది.

వివిధ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల సవరణకు ఎన్నికల సంఘం ఇచ్చిన నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై ఛీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా ఆధార్ కార్డు దేశ పౌరసత్వానికి పూర్తి ఆధారం కాదని మరోసారి స్పష్టం చేసింది.అందుకే తాము ఓటు హక్కు కల్పించేందుకు ఆమోదిస్తున్న పత్రాల జాబితాలో దీన్ని కూడా చేర్చాలని తాము ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపింది. స్వయంగా ఆధార్ చట్టమే ఇది పౌరసత్వానికి ఆధారం కాదని చెబుతున్న విషయాన్ని గుర్తుచేసింది. ఓటర్ల జాబితాలో పేరు తొలగించేముందు నోటీసు ఇవ్వాల్సిందేనంది.

Aadhaar For Intruders Too Supreme Court Poses Big Question On Voter Rights

ఆధార్ అనేది పౌరులు ప్రభుత్వ ప్రయోజనాలను పొందడానికి ఒక శాసనం అని తెలిపింది. ఎవరైనా పొరుగు దేశానికి చెందినవారు, కార్మికుడిగా పనిచేస్తున్నారని అనుకుందాం.. సదరు వ్యక్తికి రేషన్ కోసం ఆధార్ ఇచ్చారు కాబట్టి అతన్ని కూడా ఓటరుగా నమోదు చేయాలా? " అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. ఓటరు జాబితాలో చేర్చాలని కోరుతూ ఫారం 6 దరఖాస్తుతో సమర్పించిన పత్రాల ఖచ్చితత్వాన్ని నిర్ణయించే అధికార పరిధి ఎన్నికల కమిషన్‌కు ఉందని కోర్టు పేర్కొంది. ఈసీ పోస్ట్ ఆఫీసు కాదని స్పష్టం చేసింది.

Aadhaar For Intruders Too Supreme Court Poses Big Question On Voter Rights

తమిళనాడు, కేరళ , పశ్చిమ బెంగాల్‌లలో ఎస్ఐఆర్ ను ప్రత్యేకంగా సవాలు చేస్తున్న పిటిషన్లను విచారించడానికి సుప్రీంకోర్టు షెడ్యూల్‌ను నిర్ణయించింది. డిసెంబర్ 1 లోగా వీటిపై స్పందనలను దాఖలు చేయాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. పిటిషనర్లు తమ వాదనలను దాఖలు చేయవచ్చని, ఆ తర్వాత తాము నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. మరోవైపు ఎస్ఐఆర్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వాదించిన పిటిషనర్ల న్యాయవాది కపిల్ సిబల్.. ఎస్ఐఆర్ సాధారణ ఓటర్లపై రాజ్యాంగ విరుద్ధమైన భారాన్ని మోపుతుందని, వీరిలో చాలా మంది నిరక్షరాస్యులు అని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+