Aadhaar: శుభవార్త చెప్పిన ఉడాయ్.. అప్పటి వరకు ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు..
యూఐడీఏఐ శుభవార్త చెప్పింది. ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువును మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఆధార్ కార్డు ఉన్నవారు 2024 జూన్ 14 వరకు ఉచితంగా మార్పులు చేసుకోవచ్చని పేర్కొంది. మై ఆధార్ పోర్టల్‌లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. ప్రజలంతా తమ ఆధార్ కార్డుల్లో ఏవైనా మార్పులు చేసుకోవాల్సి ఉంటే ఈలోగా ఉచితంగా అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ఇంతకుముందు 2024 మార్చి 14 వరకు ఆధార్ కార్డ్ ఉచితంగా అప్‌డేట్ చేయడానికి గడువు విధించారు. తాజాగా ఆ గడువును పొడగించారు.
పోర్టల్ ద్వారా అన్ని అప్డేట్ చేయలేము. కొన్ని మాత్రమే అప్డేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మీ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవడానికి https://myaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్ కు వెళ్లాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయాలి.
ఆధార్ అప్‌డేట్ చేసుకోవడానికి సంబంధిత ధ్రువీకరణ పత్రాలను నిక్షిప్తం చేసేందుకు 'ప్రొసీడ్ టు అప్‌డేట్ అడ్రస్' అనే ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.

కావాల్సిన పత్రాలను అప్ లోడ్ చేయాలి. ఆ తర్వాత సడ్మిట్ చేయాలి. ఉచిత అప్డేట్ కేవలం అడ్రస్ కు మాత్రమే.. మిగతా అప్డేడ్స్ కోసం ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. త్వరలో మొబైల్ నంబర్ అప్డేట్ కూడా వెబ్ సైట్ లోనే చేసుకునేందకు అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది.












Click it and Unblock the Notifications