ఆప్ ఎంఎల్ఏపై కాల్పులు: జస్ట్ మిస్
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ శాసన సభ్యుడిపై కాల్పులు జరిపి హత్య చెయ్యడానికి ప్రయత్నించిన సంఘటన న్యూఢిల్లీలో జరిగింది. శాసన సభ్యుడు వేద్ ప్రకాష్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని పోలీసు అధికారులు తెలిపారు.
వేద్ ప్రకాష్ కు ఈశ్వర్ కాలనీలో ఒక కార్యాలయం ఉంది. గురువారం రాత్రి వేద్ ప్రకాష్ తన కార్యాలయంలో ఉన్నారు. అర్దరాత్రి దాటిన తరువాత ఒక గంట సమయంలో వాహనంలో వెళ్లిన దుండగులు వేద్ ప్రకాష్ కార్యాలయంపై తుపాకులతో కాల్పులు జరిపారు.

తరువాత నిందితులు అక్కడి నుండి పరారైనారు. వేద్ ప్రకాష్ దాడి నుండి తప్పించుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దుండగులు జరిపిన కాల్పులలో ఎవ్వరు గాయపడలేదని పోలీసులు చెప్పారు.
రాజకీయ కక్షల కారణంగా దాడి జరిగిందా, వేరే కారణాలు ఉన్నాయా అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. వేద్ ప్రకాష్ మీద కాల్పులు జరిపిన వారిని వెంటనే గుర్తించి అరెస్టు చెయ్యాలని ఆప్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications