వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిట్టా విప్పుతా: కేజ్రీవాల్‌పై సొంత ఎమ్మెల్యే, టీనా కూడా

By Srinivas
|
Google Oneindia TeluguNews

 AAP MLA upset with Kejriwal government
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వంపై సొంత పార్టీ శాసన సభ్యులు ఒకరు విమర్శలు గుప్పించారు. పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను అధికారంలోకి వచ్చాక నెరవేర్చడం లేదని ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీ ఆరోపించారు. ఆయన బుధవారం విలేకరులతో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని తమ ప్రభుత్వంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

కీలక అంశాల పైన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. అన్ని అంశాలతో తాను గురువారం మరోసారి మీడియాతో మాట్లాడుతానని బాంబు పేల్చారు. ఎన్నికలకు ముందు చెప్పిన దానికి, ఇప్పుడు చేస్తున్న దానికి చాలా వ్యత్యాసం ఉందన్నారు.

కుమార్ విశ్వాస్‌తో జరిగిన సమావేశంలో ప్రత్యేకత ఏమీ లేదన్నారు. తాము ఇక్కడ ముఖ్యమంత్రులం, మంత్రులం అయ్యేందుకు లేమన్నారు. భారత దేశానికి సేవ చేసేందుకు వచ్చామన్నారు. గతంలో మంత్రి పదవి దక్కనందుకు బిన్నీ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే, ఆ వివాదం అప్పుడే ముగిసింది. ఇప్పుడు ఆయన మళ్లీ సొంత ప్రభుత్వంపై ధ్వజమెత్తడం గమనార్హం.

ఒకప్పటి కాంగ్రెసు నేత అయిన బిన్నీ.. జన్ లోక్‌పాల్ ఉద్యమంలో పాల్గొని ఆ తర్వాత ఎఎపి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎఎపి పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలోని తొమ్మిది మందిలో బిన్నీ ఒకరు.

బిన్నీ వ్యాఖ్యలపై ఎఎపి నేత అశుతోష్ పరోక్షంగా స్పందించారు. స్వార్థ ప్రయోజనాల కోసం పాటు పడే వారికి పార్టీలో చోటుండదని అన్నారు. మరోవైపు, సొంత ప్రభుత్వంపై అసంతృప్తి ప్రకటించిన బిన్నీకి పార్టీ షోకాజ్ నోటీసు ఇచ్చే అవకాశాలున్నాయి.

మరో నేత ధ్వజం

కేజ్రీవాల్ ప్రభుత్వంపై ఎఎపికి చెందిన మరో నేత కూడా ధ్వజమెత్తారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఎఎపి ప్రభుత్వం పని చేయడం లేదని టీనా శర్మ అనే నేత మండిపడ్డారు. మేనిఫెస్టోలోని హామీలను పట్టించుకోవడం లేదన్న టీనా టిక్కెట్ల పంపిణీ తిరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

పదవి కోసమే: కేజ్రీవాల్

మంత్రి పదవి ఇవ్వనందునే బిన్నీ విమర్శలు చేస్తున్నారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మంత్రి పదవి, వచ్చే ఎన్నికలలో తూర్పు ఢిల్లీ లోకసభ సీటును కోరుతున్నారని చెప్పారు. ఆయితే తాను మంత్రి పదవి, లోకసభ టిక్కెట్ కోరలేదని, కేజ్రీవాల్ అబద్దాలు రేపు చెబుతానని బిన్నీ అన్నారు.

English summary
There are signs of a possible rebellion within the Aam Aadmi Party in Delhi. AAP MLA Vinod Kumar Binny has expressed unhappiness with the Arvind Kejriwal government saying it has failed to deliver on its promises. The AAP is likely to serve him a notice, say sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X