కేజ్రీవాల్ సంచలన నిర్ణయం - బిగ్ టర్న్..!!
ఢిల్లీ కేంద్రంగా కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. మహారాష్ట్రలో విజయం తో బీజేపీ క్యాంపు జోష్ మీద కనిపిస్తోంది. త్వరలో జరిగే ఢిల్లీ, బీహార్ ఎన్నికలకు సిద్దం అవుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ సైతం ఈ రెండు రాష్ట్రాల్లో పుంజుకోవాలని భావిస్తోంది. ఇదే సమయంలో ఆప్ - కాంగ్రెస్ పార్టీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఒంటరి పోటీనే ఉంటుందని కాంగ్రెస్ నుంచి సంకేతాలు వస్తుండటంతో..కేజ్రీవాల్ తాము ఢిల్లీ ఎన్నికల్లో సింగిల్ గానే పోటీ చేస్తామని ప్రకటించారు. దీంతో, ఢిల్లీలో ఎవరికి కలిసి వస్తుందనే లెక్కలు మొదలయ్యాయి.
కేజ్రీవాల్ క్లారిటీ
ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల వేళ కాంగ్రెస్ తాము ఒంటరిగానే పోటీ చేస్తామని వెల్లడించింది. దీంతో, కేజ్రీవాల్ కీలక ప్రకటన చేసారు. తమకు ఎవరితోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఇప్పటికే ఢిల్లీ ఎన్నికల కోసం ఆప్ కసరత్తు మొదలు పెట్టింది. 11 మందితో తమ అభ్యర్ధుల తొలి జాబితా ప్రకటించింది. ప్రచారం ప్రారంభించింది. తిరిగి అధికారం దక్కించుకునే లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తోంది. దీంతో, 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీ లో కాంగ్రెస్, ఆప్ ఎవరికి వారు వేర్వేరుగానే పోటీ చేయాలని నిర్ణయించాయి. ఢిల్లీలో కాంగ్రెస్ 15 ఏళ్లు అధికారంలో ఉంది. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

పొత్తులు లేకుండానే
గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఢిల్లీలో ఒక్క అసెంబ్లీ సీటు గెలవలేదు. అదే విధంగా గడిచిన రెండు పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఖాతా తెరవలేదు. ఈ ఏడాదిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ - ఆప్ పొత్తుతో బరిలోకి దిగినా ఒక్క స్థానం గెలుచుకోలేక పోయాయి. హర్యానా లోనూ పొత్తు లేకుండానే రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేసాయి. హర్యానాలో ఆప్ ఒక్క స్థానం కూడా దక్కించుకోలేదు. అధికారం ఖాయమని భావించినా హర్యానా చేజారింది. ఇక, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తరువాత ఢిల్లీలో ఆప్ - ఇండియా కూటమి పొత్తుతో బరిలోకి దిగుతాయని అంచనా వేసారు. కానీ, కేజ్రీవాల్ తమకు ఎవరితోనూ పొత్తు లేదని స్పష్టం చేసారు.
కలిసొచ్చేదెవరికి
జార్ఖండ్ సీఎంగా సోరెన్ ప్రమాణ స్వీకారానికి కేజ్రీవాల్ హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్ర నేతలతో మంత్రాంగం చేసారు. దీంతో, ఢిల్లీలో పొత్తు ఉంటుందనే చర్చ తెర మీదకు వచ్చింది. కానీ, కాంగ్రెస్ తమకు ఆప్ తో పొత్తు ఉండదని స్పష్టం చేసింది. ఆప్ పాలన పైన ప్రజల్లో వ్యతిరేకత ఉందని ఆరోపించింది. ఇప్పుడు కేజ్రీవాల్ పొత్తు పైన స్పష్టత ఇచ్చారు. దీంతో, ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మలచుకునేందుకు బీజేపీ వ్యూహాలు సిద్దం చేస్తోంది. పొత్తుల పైన స్పష్టత రావటంతో ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల ఫలితం పైన మరింత ఆసక్తి పెరుగుతోంది. కేంద్రం జమిలి దిశగా అడుగులు వేస్తున్న వేళ ఢిల్లీ రాజకీయం మరింత ఉత్కంఠ పెంచుతోంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications