వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ద్రౌపది ముర్ము అంటే చాలా గౌరవం..కానీ: మద్దతు ఎవరికనేది ప్రకటించిన ఆమ్ ఆద్మీ పార్టీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల గడువు సమీపించింది. ఇంకొక్క రోజే మిగిలివుంది. సోమవారం కొత్త రాష్ట్రపతిని ఎన్నుకొనడానికి ఎన్నికలు జరుగనున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం తరఫున ద్రౌపది ముర్ము- ప్రతిపక్ష పార్టీలు బలపరిచిన యశ్వంత్ సిన్హా మధ్య పోటీ నెలకొని ఉంది. ఇప్పటికే దాదాపుగా అన్ని పార్టీలు కూడా తమ మద్దతు ఎవరికనేది ప్రకటించాయి.

ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం- ఎన్డీఏ అభ్యర్థి వైపే మొగ్గ చూపాయి. టీఆర్ఎస్ మాత్రం యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించింది. ఈ పరిస్థితుల మధ్య ఇక తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఊహించినట్టే- యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చింది. ఈ మేరకు రాజకీయ వ్యవహారాల కమిటీలో నిర్ణయం తీసుకుంది.

AAP will support Oppositions Presidential candidate Yashwant Sinha, says MP Sanjay Singh

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్, పంజాబ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన రాఘవ్ ఛద్దా, శాసన సభ్యురాలు ఆతిషీ, ఇతర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.

ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ వెల్లడించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తాము యశ్వంత్ సిన్హాకు అనుకూలంగా ఓటు వేస్తామని స్పష్టం చేశారు. గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము అంటే తమకు చాలా గౌరవం ఉందని అన్నారు. ఈ ఎన్నికలను రాజకీయ కోణంలో చూడాల్సి రావడం వల్ల తాము ప్రతిపక్షాలు బలపరిచిన యశ్వంత్ సిన్హాకు ఓటు వేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్‌లల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి ఆ పార్టీకి 156 మంది శాసన సభ్యులు ఉన్నారు. ఇందులో 62 మంది ఢిల్లీ, 92 నుంచి పంజాబ్ అసెంబ్లీకి ప్రాతిని

English summary
AAP MP Sanjay Singh said that the party will support Opposition's Presidential candidate Yashwant Sinha and We respect Droupadi Murmu but we will vote for Yashwant Sinha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X