ఉగ్ర ఘాతుకం: అపహరించిన జవానును కాల్చి చంపారు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. రంజాన్ పండగ నేపథ్యంలో భారత ప్రభుత్వం ప్రకటించిన కాల్పుల విరమణను అలుసుగా తీసుకుని ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. గురువారం కిడ్నాప్ చేసిన భారత సైనికుడ్ని ఉగ్రవాదులు కాల్చి చంపారు.
రంజాన్ పండగ కోసం సెలవుపై ఇంటికి వెళ్లున్న ఔరంగజేబ్ అనే సైనికుడ్ని ఉగ్రవాదులు పుల్వామాలో గురువారం ఉదయం కిడ్నాప్ చేశారు. అనంతరం ఆ జవాన్‌ను కాల్చి చంపారు. సాయంత్రం జవాన్ మృతదేహాన్ని భద్రతా దళాలు కనుగొన్నాయి. పూంఛ్‌కు చెందిన ఔరంగజేబ్.. 44 రాష్ట్రీయ రైఫిల్స్‌లో పనిచేస్తున్నారు.

సీనియర్ పాత్రికేయుడి కాల్చివేత
ఇది ఇలా ఉండగా, సీనియర్ పాత్రికేయుడు, రైజింగ్ కాశ్మీర్ సంపాదకుడు సుజాత్ బుఖారీ(50)ని ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఆయన వ్యక్తిగత భద్రత అధికారిని కూడా వారు కాల్చి చంపారు. శ్రీనగర్‌లోని ప్రెస్ ఎన్‌క్లేవ్‌లో ఉన్న తన కార్యాలయం నుంచి ఇఫ్తార్ విందుకు హాజరయ్యేందుకు ఆయన బయటకు రాగానే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మరొక పోలీసు, ఒక పౌరుడు గాయపడ్డారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు చెప్పారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications