వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూ ఆర్ధిక మంత్రి ఓటమి: 36 ఏళ్ల రికార్డు బద్దలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ ఆర్ధిక మంత్రి అబ్దుల్ రహీమ్ రాధర్ ఓటమి పాలయ్యారు. 36 ఏళ్లుగా జమ్మూ అసెంబ్లీలో శాసనసభ సభ్యుడిగా ఉన్న ఆయన తాజా ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. కాశ్మీర్‌లోని చరార్-ఈ-షరీఫ్ అసెంబ్లీ స్ధానానికి 36 ఏళ్లుగా ప్రాతనిధ్యం వహిస్తున్న ఆయన ఆ స్ధానం నుంచి ఓటమి పాలయ్యారు.

ఓమర్ అబ్దుల్లా పార్టీ అయిన నేషనల్ కాన్పరెన్స్ (ఎన్‌సీ) అభ్యర్ధిగా బరిలోకి దిగిన ఆయన పీడీపీ అభ్యర్ధి, శాసనసభ మండలి మాజీ ఛైర్మన్ గులాం నబీ లోజన్ చేతిలో ఓటమి పాలయ్యారు. అబ్దుల్ రహీమ్ రాధర్‌పై లోన్ 5 వేల పై చిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు.

2002లో 3,755ఓట్లు, 2008లో జరిగిన ఎన్నికల్లో రాధర్‌పై పోటీ చేసిన గులాం నబీ లోన్ 6,375 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఐతే లక్కీగా మూడో సారి ఆయనకు అదృష్టం కలిసి వచ్చి రాధర్‌పై గెలుపొందారు. 1971 నుంచి 1982 వరకు లాయర్‌గా ప్రజలకు సేవలందించిన రాధర్... జమ్మూ కాశ్మార్‌లో నేషనల్ కాన్సరెన్స్ ప్రభుత్వం ఏర్పాటైన ప్రతిసారి అనేక అత్యున్నత పదవుల్లో కొనసాగారు. స్పీకర్ పదవిని కూడా సొంతం చేసుకున్నారు.

Abdul Rahim Rather's defeat ends record 36-year stint in J&K Assembly

ఆర్ధిక మంత్రితో పాటు వ్యవసాయం, రూరల్ డెవలప్‌మెంట్, పార్లమెంటరీ వ్యవహారాలు లాంటి శాఖలను సమర్దవంతంగా నిర్వహించిన పేరు రాధర్‌కు ఉంది. ఇది ఇలా ఉంటే జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో ఒక చోట ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు ఎదురు దెబ్బ తగిలింది.

పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒక చోట ఆయన ఓటమి పాలయ్యారు. ఆయన సోనావర్ నియోజకవర్గంలో పిడిపి అభ్యర్థి అష్రఫ్ చేతిలో ఓటమి పాలయ్యారు. బీర్వాలో ఆయన విజయం సాధించారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో అనంతనాగ్ నుంచి ప్రతిపక్ష నేత పిడిపి నేత ముఫ్తీ మహ్మద్ సయీద్ విజయం సాధించారు.

English summary
Finance Minister Abdul Rahim Rather's record run in Jammu and Kashmir Assembly ended today when he lost from Charar-e-Sharief while his National Conference colleague Ali Mohammad Sagar equalled his feat of sixth consecutive victories by winning Khanyar seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X