వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలపై షాకింగ్.. రూ.5వేల కోట్లు దాటిన బెట్టింగ్స్.. ఏపార్టీపై ఎంతంటే..

|
Google Oneindia TeluguNews

క్రికెట్ మ్యాచ్ పై బెట్టింగ్‌లో.. తుది ఫలితంపై ఒకలా.. ఓవరాల్ స్కోరుపై ఇంకోలా.. బంతి బంతికీ మరోలా బెట్టింగ్ జరిగినట్లే.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనా పందేలు జోరుగా సాగుతున్నాయి. ఏ పార్టీ అధికారం చేపడుతుందనే ప్రధానాంశానికితోడు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు, సీఎం క్యాండిడేట్, ఫనానా నియోజకవర్గంలో ఎవరిది పైచేయి అవుతంది? అంటూ వీలైనన్ని వక్రమార్గాల్లో బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటివరకు అందిన రిపోర్టుల ప్రకారం ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలపై బెట్టింగ్ ల వివుల రూ.5వేల కోట్లు దాటేసింది.

ఫేవరెట్ ఆయనే..

ఫేవరెట్ ఆయనే..


మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి శనివారం పోలింగ్ జరిగింది. మంగళవారం(ఈనెల 11న) ఫలితాలు వెలువడనున్నాయి. దీనిపై ఢిల్లీతోపాటు ముంబై, బెంగళూరు, చండీగఢ్, జైపూర్, అహ్మదాబాద్, హైదరాబాద్, లక్నో, పాట్నా తదితర సిటీల్లో భారీ ఎత్తున బెట్టింగ్ జరుగుతున్నట్లు రిపోర్టులు వచ్చాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలన్నీ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు అనుకూలంగా రావడంతో పందెంరాయుళ్లందరూ ఆ పార్టీవైపే మొగ్గుచుపుతున్నారని, సీఎం అభ్యర్థిపై పందెంలో ఆయనే ఫేవరెట్ గా నిలిచారని సట్ట బజార్ వర్గాలు పేర్కొన్నాయి.

ఆప్ కు 75 పైసలు.. కాంగ్రెస్ కు రూ.5

ఆప్ కు 75 పైసలు.. కాంగ్రెస్ కు రూ.5

సాధారణంగా బెట్టింగ్ మార్కెట్ లో.. సంభావ్యత ఎక్కువ ఉన్నవాళ్లకు రేటు తక్కువ ఉండటం తెలిసిందే. డబ్బులు పెడుతున్నవాళ్లలో చాలా మంది ఆప్ వైపు మొగ్గుచూపిస్తుండటంతో దానిపై వచ్చే లాభాన్ని కూడా బుకీలు 75 పైసలకు తగ్గించేశారు. అంటే, ఎన్నికల్లో ఆప్ గెలిస్తే ఒక రూపాయికి 75 పైసలు లాభం వస్తుందనమాట. అలాగే బీజేపీపై రూపాయికి 85 పైసల బెట్టింగ్ నడుస్తోంది. ఇక ఢిల్లీలో పెద్దగ ప్రభావం చూపని కాంగ్రెస్ పార్టీపై మాత్రం రూపాయికి 5రూయాలయల బెట్టింగ్ సాగుతున్నట్లు బుకీలు వివరించారు. ఎగ్జిట్ పోల్ అంచనాలన్నీ తారుమారై, కాంగ్రెస్ గనుక అధికారంలోకి వస్తే.. ఆ పార్టీపై బెట్టింగ్ పెట్టినవాళ్లంతా భారీగా లాభపడతారన్నమాట.

మనోజ్ తివారీపై రూ.2

మనోజ్ తివారీపై రూ.2


ముఖ్యమంత్రి అభ్యర్థుల విషయానికొస్తే.. కేజ్రీవాల్ పై రూపాయికి 40 పైసల బెట్టింగ్ నడుస్తోందని, బీజేపీ అధికారికంగా ప్రకటించకున్నా సీఎం అభ్యర్థిగా భావిస్తోన్న మనోజ్ తివారిపై రూపాయికి 2రూపాయల బెట్టింగ్ కొనసాగుతున్నట్లు సమాచారం. ఎగ్జిట్ పోల్ ఫలితాలు తారుమారై, ఢిల్లీలో బీజేపీనే అధికారంలోకి వస్తుందని తివారి ప్రకటించిన తర్వాత ఆయన రేటు కొద్దిగా తగ్గే అవకాశాలు కనపడుతున్నాయిన బెట్టింగ్ నిర్వాహకులు పేర్కొన్నారు. కాంగ్రెస్ తరఫున సీఎం క్యాండేట్ పై బెట్టింగ్ పెట్టేందుకు ఎవరూ ముందుకురానట్లు తెలుస్తోంది. ఫలితాల వెల్లడికి టైమ్ దగ్గరపడుతున్నకొద్దీ పందెం రాయుళ్లు మరింత జోరుపెంచారు. ఇప్పటిరవకు రూ.5వేల కోట్లుగా తేలిసి బెట్టింగ్ విలువ.. రెట్టింపయ్యే అవకాశాలున్నాయి.

English summary
According to the bookies, there have been no bets placed on any Congress candidate becoming the chief minister, with Delhi chief Arvind leading in the betting circle to become the Chief Minister of the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X