ABP Matrize Exit Poll: మహారాష్ట్రలో వారిదే అధికారం-తేల్చేసిన ఏబీపీ మ్యాట్రిజ్ పోల్..!

మహారాష్ట్రలో ఇవాళ జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై జాతీయ మీడియా సంస్థ ఏబీపీ సర్వే సంస్థ మ్యాట్రిజ్ తో కలిసి ఎగ్జిట్ పోల్ నిర్వహించింది. ఇందులో మహారాష్ట్రలో మహాయుతి, మహా వికాస్ అఘాడీ కూటముల మధ్య హోరాహోరీ పోరు జరిగినట్లు తేలింది. అయితే ఇందులో మహాయుతి కూటమి మరోసారి అధికారం నిలబెట్టుకోనుందని ఈ ఎగ్జిట్ పోల్ తేల్చింది. మహా వికాస్ అఘాడీకి మాత్రం నిరాశ తప్పదని స్పష్టం చేసింది.

మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లు ఉన్నాయి. ఇందులో ఈసారి బీజేపీ, శివసేన షిండే వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంతో కూడిన మహాయుతి కూటమికి 150 నుంచి 170 సీట్లు వస్తాయని ఏబీపీ మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. అలాగే కాంగ్రెస్, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గంతో కూడిన మహా వికాస్ అఘాడీ కూటమికి కేవలం 110 నుంచి 130 సీట్లు వస్తాయని ఈ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.

abp matrize exit poll predicts mahayuti alliance victory in maharastra

అలాగే మహాయుతి కూటమికి పోలైన మొత్తం ఓట్లలో 46 శాతం లభించబోతున్నట్లు ఏబీపీ మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. అటు మహా వికాస్ అఘాడీ కూటమికి మాత్రం కేవలం 42 శాతం ఓట్లే లభిస్తున్నట్లు తెలిపింది. మిగిలిన ఓట్లు ఇతరులకు లభించే అవకాశమున్నట్లు అంచనా వేసింది. తద్వారా ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి గెలిచి అధికారం చేపట్టనుందని తేల్చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+