కర్నూలు నకిలీ పాస్‌పోర్టు కేసు: దోషిగా అబూ సలేం

ఆ తర్వాత ఇద్దరు నిందితులను నవంబర్ 11, 2005లో భారతదేశానికి తీసుకురావడం జరిగింది. 2007లో మౌనికా బేడీని భోపాల్ కోర్టు నిర్ధోషిగా ప్రకటించడంతో మౌనికా బేడి జైలు నుంచి విడుదలయ్యారు. మౌనికా బేడి డిసెంబర్ 4, 2006 నుంచి జులై 16, 2007 వరకు జైలు శిక్ష్ అనుభవించారు.
కాగా 2009 నుంచి అబూ సలేం నకిలీ పాస్ పోర్టుపై హైదారబాద్ సిబిఐ విచారణ జరుపుతోంది. అబూ సలేం పాస్ పోర్టు దరఖాస్తులో తన పేరును రామిల్ కమిల్ మాలిక్‌గా పేర్కొన్నట్లు విచారణలో తేలినట్లు సమాచారం.
1993లో మహారాష్ట్రలోని ముంబైలో జరిగిన వరుస పేలుళ్లలో ప్రధాన నిందితుడైన అబూ సలేం జైలులో ఉన్న సమయంలో అతనిపై రెండు సార్లు దాడులు జరిగాయి. ఓ హత్య కేసులో నిందితుడైన దేవేంద్ర జగ్‌తప్ జైలులో ఉన్న అబూ సలేంపై ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. 2005లో అబూ సలేంను భారత్ తీసుకొచ్చిన అనంతరం 2010లో ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకు తరలించిన సమయంలో తొలిసారి అతనిపై దాడి జరిగింది.












Click it and Unblock the Notifications