దేశంలో తొలిసారిగా థానే స్టేషన్‌లో ఏసీ టాయిలెట్

న్యూఢిల్లీ: దేశంలోనే మొట్ట మొదటసారిగా భారతీయ రైల్వే స్టేషన్లో ఏసీ టాయిలెట్‌ను ఏర్పాటు చేసింది. శనివారం దీని ప్రారంభోత్సవం జరగనుంది. దీంట్లో పురుషుల విభాగంలో 30 యూరిననల్స్, 4 లెట్రిన్ల ఏర్పాటు చేశారు.

అదే విధంగా మహిళలకు 6 వాటర్ క్లోజెట్ సెక్షన్లను ఏర్పాటు చేశారు. వికలాంగులకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అత్యంత రద్దీగా ఉండే థానే స్టేషన్‌ను రోజుకు 7 లక్షల మంది సందర్శిస్తారు. ప్రస్తుతం థానే స్టేషన్ లో ప్రస్తుతం 3 టాయిలెట్లు ఉన్నాయి.

తదుపరి, ఏసీ టాయిలెట్ సౌకర్యాన్ని డోంబివ్లి స్టేషన్లోనూ ఏర్పాటు చేస్తామని ఓ రైల్వే అధికారి తెలిపారు. ఈ టాయిలెట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపీ రాజన్ విచారే రానున్నారని తెలిపారు.

 AC toilet at Thane stn to open this Saturday

మొదటి హైస్పీడ్ రైలు కోసం 17 బోగీలు సిద్ధం:

ఇక ఢిల్లీ - ఆగ్రా మధ్య త్వరలో ప్రారంభించనున్న హైస్పీడ్ రైలు కోసం 17 బోగీలు సిద్దమయ్యాయని రైలు బోగీ తయారీ పరిశ్రమ అధికారులు గురువారం తెలిపారు. ఈ హైస్పీడ్ రైలు గంటలకు 160 కిలోమీటర్ల వేగంతో నడవనుంది.

ఎక్కువ స్పీడ్‌తో నడిచే రైలు కోసం తయారు చేసిన 17 బోగీలను ఉత్తర రైల్వేకు అప్పగించామని ఆర్సీఎఫ్ జనరల్ మేనేజర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఐతే ఢిల్లీ - ఆగ్రాల మధ్య ఈ హైస్పీడ్ రైలు ఎప్పటి నుంచి ప్రారంభించాలనేది మాత్రం రైల్వే అధికారులు నిర్ణయిస్తారని ఆయన చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో ఆ బోగీలు ఢిల్లీకి చేరుకుంటాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+