ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు: సరికొత్త స్లోగన్‌తో ప్రచారం ప్రారంభించిన కేజ్రీవాల్ పార్టీ ఆప్

ఢిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభించింది అధికార ఆమ్‌ఆద్మీ పార్టీ. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల స్లోగన్‌ను విడుదల చేసింది ఆమ్‌ ఆద్మీ పార్టీ. "అచ్చే బీటే పాంచ్ సాల్-లగే రహో కేజ్రీవాల్" అనే నినాదంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆప్ సన్నద్ధమవుతోంది. "అచ్చే బీటే పాంచ్ సాల్-లగే రహో కేజ్రీవాల్" అనే నినాదానికి అర్థం - ఐదేళ్ల పరిపాలన బాగా సాగింది..ఇలాంటి పాలనే కేజ్రీవాల్ తిరిగి అందిస్తారు అని స్లోగన్ అర్థం.

ఇక ఈస్లోగన్‌‌ను ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆప్ ఎమ్మెల్యేలు ఇతర పార్టీ ప్రముఖలు పాల్గొన్నారు. కేజ్రీవాల్ పాలనపై ఢిల్లీ నగరవాసుల అభిప్రాయం తెలుసుకున్న మీదటే స్లోగన్‌ను రూపొందించినట్లు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చెప్పారు. 2015లో జరిగిన ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ 67 స్థానాలను గెలుచుకుంది. ఇక అధికారంలో వచ్చినప్పటి నుంచి కేజ్రీవాల్ ఇటు కేంద్ర ప్రభుత్వంతోను అటు అప్పటి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ జనరల్‌తోను సమస్యలు ప్రారంభమయ్యాయి.

Acche beete paanch saal-Lage raho Kejriwal:AAP slogan for Delhi polls

ఇక ఈ ఎన్నికలకు కేజ్రీవాల్ ప్రముఖ ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సంస్థ ఐప్యాక్ సహాయం తీసుకోనున్నారు. ప్రశాంత్ కిషోర్‌ను హైర్ చేసుకున్నట్లు ఈ మధ్యే అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ప్రశాంత్ కిషోర్ ఇప్పటి వరకు పలు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలకు తన వంతు సహాయం చేసి ఆ పార్టీలను ప్రభుత్వంలోకి తీసుకురావడంలో కృషి చేశారు. ఇక ఢిల్లీలో బీజేపీ కూడా ఈసారి బలపడిందనే నివేదికలు వస్తున్నాయి. 2017 పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం 7 సీట్లు ఉండగా బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. దీని బట్టి చూస్తే అక్కడ బీజేపీ బలపడిందనే సంకేతాలు వస్తున్నాయి. అయితే ప్రశాంత్ కిషోర్ సహాయంతో ఆప్ అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్నందున ఆయన ఎంతవరకు చక్రం తిప్పుతారో చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+