హైదరాబాద్ కేంద్రంగా అమిత్ షా మహా పాదయాత్ర ఎంపిక వెనుక..!!

హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. జాతీయ స్థాయిలో మారుతున్న రాజకీయ సమీకరణాలకు హైదరాబాద్ కేంద్రంగా కౌంటర్ చేసేందుకు సిద్దం అవుతోంది. బీజేపీ ఈ సారి దక్షిణాది రాష్ట్రాల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోంది. అందులో భాగంగా తెలంగాణలో కొత్త ఆపరేషన్ ప్రారంభించింది. ఇప్పుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ లో మహా పాద యాత్రకు సిద్దమయ్యారు. ఈ నిర్ణయం వెనుక భారీ వ్యూహం ఉంది. ఇప్పుడు ఈ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారుతోంది.

ఎన్నికల సంఘం పైన గురి పెట్టిన ఇండియా కూటమి వరుస నిరసనలకు నిర్ణయించింది. రేపు (నవంబర్ 1)న ఢిల్లీ భారీ మార్చ్ నిర్వహించాలని డిసైడ్ అయింది. దేశ వ్యాప్తంగా భారీ సంఖ్య లో కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీ చేరుకుంటున్నారు. దీంతో.. ఇప్పుడు బీజేపీ వీరిని రివర్స్ ఎటాక్ చేయాలని భావిస్తోంది. ఇందు కోసం కొత్త కార్యాచరణ డిసైడ్ చేసింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో నవంబర్ 2న మహా పాదయాత్ర చేపడుతోంది. ఇందులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా పాల్గొంటున్నారు.

బీజేపీ ముఖ్య నేతలకు అధిష్ఠానం పిలుపు - కీలక మలుపు..!!
బీజేపీ ముఖ్య నేతలకు అధిష్ఠానం పిలుపు - కీలక మలుపు..!!
Amit Shah to Attend Maha Padayatra in Hyderabad on November 2 here the ground report

ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. 2వ తేదీ మధ్యాహ్నం 1.55 గంటల కు అమిత్ షా ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకుంటారు. 2.10 నుంచి 3.55 వరకు కాకతీయ హోటల్ లో భోజన విరామం.. పార్టీ నేతలతో సమావేశం ఉంటుంది. 3.50 కి నిజాం కాలేజ్ వద్దకు చేరుకుంటారు. నాలుగు గంటలకు నిజాంకాలేజ్ వద్ద ఉన్న బాబూ జగజ్జీవన్ రామ్ విగ్రహం నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. మొజంజాహీ మార్కెట్ చౌరస్తా వద్ద ముగియనుంది. ఈ ముగింపు సభలో అమిత్ షా పార్టీ శ్రేణులను, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

అయితే, పార్టీ శ్రేణులతో మాత్రమే కాకుండా.. తటస్థులు... వివిధ వర్గాలకు చెందిన నిపుణులు, వైద్యులు, న్యాయవాదులు, మేధావులు ఈ యాత్రలో పెద్ద ఎత్తున భాగస్వాములయ్యేలా బీజేపీ వ్యూహరచన చేసింది. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలపై, ముఖ్యంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ జాబితాల అంశంపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే ప్రధాన లక్ష్యంగా ఈ మహా పాదయాత్రను చేపడుతున్నట్టు పార్టీ నేతలు వెల్లడించారు. ప్రతిపక్షాలు కావాలనే తప్పుడు సమాచారంతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయని, దీనివల్ల సమాజంలో అరాచకం సృష్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

 ఇక తప్పుకోండి.. ఆ నేతలకు తేల్చి చెప్పిన బీజేపీ హైకమాండ్..!!
ఇక తప్పుకోండి.. ఆ నేతలకు తేల్చి చెప్పిన బీజేపీ హైకమాండ్..!!

త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికలతో పాటుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేడర్‌లో జోష్ నింపేందుకు హైదరాబాద్ కేంద్రంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ జాతీయ స్థాయిలో చేస్తున్న ఆందోళనకు ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం నుంచే సమాధానం ఇచ్చేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. దీంతో, ఈ మహా పాదయాత్ర తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు గా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+