భారతీయ సినీ చరిత్రలో సరికొత్త అధ్యాయం
సినిమా థియేటర్‌లో చూసే అనుభూతిని ఔట్‌డోర్‌లోనూ ప్రేక్షకులకు అందించాలనే వినూత్న ఆలోచనతో 'ఓ నా సిద్ధయ్య' టీమ్ సరికొత్త సంచలనానికి తెరలేపింది. ఇండియాలోనే తొలిసారిగా ఔట్‌డోర్ వేదికపై 70ఎంఎం భారీ స్క్రీన్‌తో పాటు డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి ఈ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్‌ను అత్యంత వైభవంగా విడుదల చేసింది. అక్టోబర్ 30న శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని శంషాబాద్ ప్రభుత్వ కళాశాల, పాఠశాల మైదానంలో జరిగిన ఈ వేడుకకు 5 వేల మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ప్రేక్షకుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అభిమానులు, ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ గ్రాండ్ ఈవెంట్‌కు ప్రముఖ నటుడు సోనూసూద్ ముఖ్య అతిథిగా హాజరై 'ఓ నా సిద్ధయ్య' పాటను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓపెన్ ప్లేస్‌లో 70ఎంఎం భారీ స్క్రీన్‌పై పాటను విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఇలాంటి వినూత్న ప్రయత్నం చేసిన సిద్ధయ్య టీమ్‌ను అభినందిస్తూ, పాట మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. మరో ముఖ్య అతిథిగా హాజరైన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. 'ఓ నా సిద్ధయ్య' పాట ప్రేక్షకుల ఆదరణ పొందడంతో పాటు పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు.

భార్యాభర్తల ప్రేమానుబంధానికి ప్రతిరూపం 'ఓ నా సిద్ధయ్య'
'ఓ నా సిద్ధయ్య' అనేది భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ, అనుబంధం, పరస్పర అవగాహన, జీవితాంతం ఒకరికొకరు తోడుగా నిలిచే తత్వాన్ని ఆవిష్కరించే 'భార్యాభర్తల భావోద్వేగ ప్రేమకథ'. పల్లెటూరి నేపథ్యంలో రూపొందిన ఈ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్‌లో సిద్ధయ్య, చిట్టెమ్మ పాత్రల ద్వారా దాంపత్య జీవితంలోని సహజమైన భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించారు.
సిద్ధయ్య పాత్రలో నటించడంతో పాటు ఈ పాటను నిర్మించిన సిద్ధు రెడ్డి కందకట్ల నిజజీవిత అనుభవాల స్ఫూర్తితో ఈ పాటను రూపొందించడం విశేషం. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా భార్యాభర్తలు ఒకరికొకరు అండగా నిలవడం, కష్టసుఖాలను కలసి పంచుకోవడం, పరస్పర నమ్మకంతో జీవితాన్ని ముందుకు నడిపించడం వంటి విలువైన అంశాలను ఈ పాటలో అందంగా చూపించారు. కేవలం భార్యాభర్తల మధ్య ప్రేమకే పరిమితం కాకుండా, తమ చుట్టూ ఉన్నవారి కష్టాలను అర్థం చేసుకుంటూ, అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తూ సమాజ సేవలోనూ భాగస్వాములయ్యే సిద్ధయ్య, చిట్టెమ్మ పాత్రలు ఈ పాటకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి. కుటుంబ బంధాల గొప్పతనాన్ని చాటిచెబుతూ, కష్టకాలంలోనూ ఒకరికొకరు తోడుగా నిలవాలనే సందేశాన్ని ఈ పాట ప్రేక్షకులకు అందిస్తుంది.
వినోదంతో పాటు సామాజిక సేవకు పెద్దపీట
'ఓ నా సిద్ధయ్య' గ్రాండ్ లాంచ్ కేవలం పాట విడుదలకే పరిమితం కాలేదు. సామాజిక బాధ్యతకు కూడా పెద్దపీట వేస్తూ సిద్ధు రెడ్డి కందకట్ల మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గతంలో నిర్వహించిన కార్యక్రమంలో 300 మంది ఆటో డ్రైవర్లకు బీమా సదుపాయాలు కల్పించి, నిత్యం కష్టపడి జీవించే వారికి భద్రత కల్పించే ప్రయత్నం చేశారు. అలాగే సినీ పరిశ్రమలో తెరవెనుక పనిచేసే కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వారికి హెల్మెట్లు పంపిణీ చేశారు. రోడ్డు భద్రత, ఉపాధి అవకాశాలు, ఆర్థిక సహాయం వంటి అంశాల ద్వారా అవసరంలో ఉన్నవారికి అండగా నిలవాలన్నదే ఆయన లక్ష్యం.













Click it and Unblock the Notifications
