పులివెందులలో జగన్ ఓటు వేయచ్చు..కానీ, ఆ తరువాత నేరుగా- డీఐజీ కోయ ప్రవీణ్..!!
ఏపీలో మున్సిపల్ ఎన్నికల వేళ అందరి చూపు పులివెందుల వైపే నెలకొంది. అక్కడ టీడీపీ, వైసీపీ ఈ సారి గెలుపు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. నామినేషన్ల వేళ చోటు చేసుకున్న ఘటన లతో ఇక్కడ రాజకీయం హోరా హోరీగా మారింది. కాగా.. మాజీ సీఎం జగన్ పులివెందులలో తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇదే అంశం పైన డీఐజీ కోయ ప్రవీణ్ స్పందించారు. జగన్ ఓటు హక్కు వినియోగించుకునే స్వేచ్ఛ ఉందని.. అదే సమయంలో కీలక సూచనలు చేసారు.
పులివెందుల మున్సిపల్ సమరం ఉత్కంఠ పెంచుతోంది. నామినేషన్ల సమయంలో కడప జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలతో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంది. పులివెందుల, కడప కార్పోరేషన్ లో పలు వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. జిల్లాలోని అనేక మున్సిపాల్టీలను టీడీపీ ఏకగ్రీవంగా తన ఖాతాలో వేసుకుంది. ఇక.. పులివెందులలోనూ విజయం సాధించాలని టీడీపీ.. తమ పట్టు కోసం వైసీపీ ఈ ఎన్నికలో హోరా హోరీగా తల పడుతున్నాయి. తాజాగా పులివెందుల పర్యటనలో మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. తాను ఎన్నికల్లో ఓటు వేసేందుకు వస్తానని.. ఇక్కడే ఓటు వేస్తానని.. ఎవరు వస్తారో రావాలని సవాల్ చేసారు. జగన్ తన చొక్క మడత పెట్టి సవాల్ చేయటం పైన టీడీపీ నేతలు ఘాటుగా స్పందించారు. కాగా.. జగన్ వేటు వేసేందుకు పులివెందుల కు వస్తున్నారు.

పులివెందులలో ప్రత్యేక బలగాలు
పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో బాకరాపేట పోలింగ్ స్టేషన్ లో ఓటు వేయనున్నారు. కాగా, జగన్ పోలింగ్ సమయంలో పులివెందుల కు రావటం పైన డీఐజీ కోయ ప్రవీణ్ స్పందించారు. జగన్ తన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చన్నారు. అది ఆయనకు ఉన్న హక్కు అని పేర్కొన్నారు. అయితే, ఓటు వేసిన తర్వాత జగన్.. నేరుగా ఇంటికి వెళ్లాలని సూచించారు. ఎన్నికల సందర్భంగా పులివెందుల పట్టణంలో తిరిగేందుకు ఆయనకు అనుమతి లేదన్నారు. ఎవరైనా పులివెందులలో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల సందర్భంగా పులివెందుల, జమ్మలమడుగు, కడపలో అదనపు బలగాలతో బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 3 వేల మంది పోలీసు బలగాలను మోహరించినట్లు డీఐజీ కోయ ప్రవీణ్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications
