వైభవ్ సూర్యవంశీని ఇంటికి పంపండి

న్యూజిలాండ్‌తో ఆక్లాండ్‌ వేదికగా జరిగిన నాలుగో టీ20లో భారత జట్టు ఓటమి పాలు కావడం నూతన వివాదానికి తెర తీసింది. తుది జట్టు ఎంపిక వ్యవహారంపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. తొలి మూడింటినీ గెలుచుకుని సిరీస్‌ను ఇప్పటికే కైవసం చేసుకున్నప్పటికీ.. టీమిండియా మేనేజ్మెంట్ యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వకపోవడం, ప్రత్యేకించి.. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని తుది జట్టు నుంచి తప్పించడం పట్ల విమర్శలు మొదలయ్యాయి.

సిరీస్ గెలవడం వల్ల మిగిలిన రెండు మ్యాచ్ లు కూడా నామమాత్రం కావడం వల్ల యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇస్తారని అందరూ భావించారు. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ గాయపడటంతో జట్టులోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ రెండో టీ20లో విఫలమైనా, మూడో మ్యాచ్‌లో 45 పరుగులతో సత్తా చాటాడు. ఇషాన్ కిషన్ గాయం నుంచి కోలుకుని తిరిగి రాగానే, వైభవ్‌ను బెంచ్‌కే పరిమితం చేశారు.

Aakash Chopra has raised concerns over Vaibhav Sooryavanshi omission from fourth T20I New Zealand

టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న ఈ నిర్ణయంపై టీమిండియా మాజీ ప్లేయర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆగ్రహం వ్యక్తం చేశాడు. సాధారణంగా ఓ రెగ్యులర్ ప్లేయర్ కోలుకున్నప్పుడు అతనికి ప్రత్యామ్నాయంగా వచ్చిన ఆటగాడు తప్పుకోవడం సహజమే అయినప్పటికీ, సిరీస్ ఫలితం ఇప్పటికే తేలిపోయిన మ్యాచ్‌లో కూడా దీన్ని వర్తింపజేయడం సరైన పద్ధతి కాదని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని సూచించాడు.

పత్తిపై కేంద్రం తాజా నిర్ణయం: డిసెంబర్ 31 వరకూ
పత్తిపై కేంద్రం తాజా నిర్ణయం: డిసెంబర్ 31 వరకూ

ఎవరైనా గాయపడినప్పుడు మాత్రమే వైభవ్ సూర్యవంశీకి మ్యాచ్ ఆడే అవకాశం ఇవ్వడం సరి కాదని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. టీమ్ మేనేజ్మెంట్ ఆలోచన అదే అయితే వైభవ్ సూర్యవంశీని బెంచ్‌పై కూర్చోబెట్టడం కంటే కూడా వెంటనే అతన్నిఇంటికి పంపించడం మంచిదని, కనీసం ఫస్ట్ క్లాస్ క్రికెట్ అయినా ఆడుకుంటాడని వ్యాఖ్యానించాడు. బెంచ్‌కే పరిమితం చేయడం వల్ల అతని ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని స్పష్టం చేశాడు.

మక్కా మదీనానూ వదలని హౌతీలు: వైమానిక దాడులు
మక్కా మదీనానూ వదలని హౌతీలు: వైమానిక దాడులు

డ్రెస్సింగ్ రూమ్‌లో సీనియర్ ఆటగాళ్లతో సమయం గడపడం వల్ల ఎంతో కొంత నేర్చుకునే అవకాశం ఉన్నప్పటికీ, మ్యాచ్ ఆడటం వల్ల వచ్చే అనుభవానికి అది ప్రత్యామ్నాయం కాదని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. సుదీర్ఘ కాలం పాటు బెంచ్ కే పరిమితం చేయడం వల్ల ఓ ప్లేయర్ ఆత్మవిశ్వాసం సడలే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించాడు. అందుకే సిరీస్ గెలిచినప్పుడైనా యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం మంచిదని చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+