భార్య నగలు, వాచీలు కొట్టేసిన భర్త.. రూ.129 కోట్లు డిమాండ్ చేసిన భార్య.. కోర్టు తీర్పు తెలిస్తే షాకే!

కుటుంబ వివాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు మెట్లు ఎక్కడం సాధారణమే. అయినప్పటికీ దుబాయ్‌లో ఓ విచిత్రమైన కేసు సంచలనం సృష్టిస్తోంది. తన ఖరీదైన నగలు, వాచీలు, నగదును దొంగిలించిన భర్త, అతడి కుమారుడిపై ఓ మహిళ చట్టపరమైన పోరాటం చేసి గెలిచిది. ఈ కేసులో విచారణ చేపట్టిన స్థానిక న్యాయస్థానం.. బాధితురాలికి ఏకంగా 16.1 మిలియన్ దిర్హమ్‌లు (దాదాపు రూ.40 కోట్లు) చెల్లించాలని భర్త, కుమారుడిని ఆదేశిస్తూ సంచలన తీర్పునిచ్చింది.

విజయవాడలో దారుణం: నీళ్ల బాటిల్ కోసం 2 గంటలు హింసించి ప్రాణాలు తీశారు!
విజయవాడలో దారుణం: నీళ్ల బాటిల్ కోసం 2 గంటలు హింసించి ప్రాణాలు తీశారు!

ఇంట్లోనే భారీ దొంగతనం.. అసలేం జరిగిందంటే?
దుబాయ్‌కు చెందిన ఇద్దరు దంపతుల మధ్య కొన్నాల్లుగా తీవ్రమైన విభేదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో భర్త, ఆయన కుమారుడు కలిసి ఇంట్లో లేని సమయంలో భార్యకు చెందిన విలువైన వస్తువులను కాజేశారు. వారు ఇంట్లో నుంచి 100కు పైగా అత్యంత విలువైన బంగారు, వజ్రాభరణాలు, అంతర్జాతీయ బ్రాండెడ్ ఖరీదైన వాచీలు, పెద్ద మొత్తంలో నగదును దొంగిలించారు. కాజేసిన వస్తువుల మొత్తం విలువను 15.1 మిలియన్ దిర్హమ్‌లుగా (దాదాపు రూ.37.5 కోట్లు) నిర్ధారించారు.

Dubai Court Orders Husband to Pay Rs 40 Crore After Stealing Wife Jewelry and Watches Full Details

క్రిమినల్ కోర్టులో జైలు శిక్ష.. సివిల్ కోర్టులో రూ.129 కోట్ల పరిహారం దావా
ఈ ఘటనపై బాధితురాలు ముందుగా క్రిమినల్ కోర్టును ఆశ్రయించగా.. సమగ్ర విచారణ అనంతరం కోర్టు భర్తను, ఆయన కొడుకును దోషులుగా తేల్చింది. వారిద్దరికీ ఏడాది జైలు శిక్షతో పాటు దొంగిలించిన వస్తువుల విలువకు సమానమైన 15.1 మిలియన్ దిర్హమ్‌ల జరిమానా విధించింది. అయితే క్రిమినల్ కోర్టు తీర్పుతో సంతృప్తి చెందని భార్య, తనకు జరిగిన ఆర్థిక నష్టంతో పాటు తీవ్ర మానసిక క్షోభకు భారీ పరిహారం కోరుతూ సివిల్ కోర్టులో దావా వేసింది. ఆమె 5 కోట్ల దిర్హమ్‌లు (దాదాపు రూ.129 కోట్లు) నష్టపరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేసింది.

మొదటి భర్తను వదిలేసింది.. రెండో మొగుడిని చంపేసింది.. చివరకు!
మొదటి భర్తను వదిలేసింది.. రెండో మొగుడిని చంపేసింది.. చివరకు!

దొంగతనం జరిగినప్పటి నుంచి బంగారం ధరలు 70 శాతం పెరిగాయని, దీనివల్ల తాను దాదాపు 11 మిలియన్ దిర్హమ్‌ల లాభాన్ని కోల్పోయానని పేర్కొంది. అంతేకాకుండా సొంత కుటుంబ సభ్యులే చేసిన ఈ మోసం వల్ల తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యానని, దానికిగాను 23.9 మిలియన్ దిర్హమ్‌ల పరిహారం కావాలని వాదించింది.

సివిల్ కోర్టు తీర్పు
కేసు విచారణ సందర్భంగా సివిల్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దొంగతనం జరిగిన మాట వాస్తవమేనని.. భార్య గత 18 నెలలుగా తన విలువైన ఆస్తులను వాడుకోలేక తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొందని అంగీకరించింది. అయితే బంగారం ధరల పెరుగుదల వల్ల రాబోయే అంచనాల ఆధారంగా పరిహారం ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. కేవలం ప్రత్యక్షంగా నిరూపించబడిన వాస్తవ నష్టాల ఆధారంగానే తీర్పు వెలువరించవచ్చని తెలిపింది. సమగ్ర విచారణ అనంతరం కోర్టు దొంగిలించబడిన వస్తువుల అసలు విలువ 15.1 మిలియన్ దిర్హమ్‌లతో పాటు భార్యకు కలిగిన మానసిక క్షోభకు, న్యాయపోరాట శ్రమకు గాను అదనంగా మిలియన్ దిర్హమ్‌ల పరిహరాన్ని ఖరారు చేసింది. మొత్తం 16.1 మిలియన్ దిర్హమ్‌లను(రూ.40 కోట్లు) భర్త, అతని కుమారుడు సంయుక్తంగా బాధితురాలికి చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+