viral video: నువ్ సూపర్ అమ్మ.. రెప్పపాటులో ట్రక్కు నుంచి కాపాడిన మాతృమూర్తి.. నెటిజన్ల నీరాజనం..
బిడ్డను సేవ్ చేయడంలో తల్లి తర్వాతే ఎవరైనా.. ఎందుకంటే ప్రాణాలకు తెగించి మరీ కాపాడుతారు. చాలా సందర్భాల్లో చూశాం. కేవలం మనుషులే కాదు.. మూగ జీవాలు, వన్య ప్రాణులకు కూడా వర్తిస్తాయి. అయితే ఇటీవల ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. అందులో ఓ తల్లి రెప్పపాటులో తన బిడ్డను ప్రమాదం నుంచి కాపాడారు. మిగతా వారు అయితే కష్టమే అని చెప్పొచ్చు. ఆ వీడియో చూసి నెటిజన్లు నీరాజనం పడుతున్నారు. వావ్ మా అని అంటున్నారు. మీకు మీరే సాటి అని కీర్తిస్తున్నారు.

కారు డ్యాష్.. కిందపడ్డ తల్లీ బిడ్డ
ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు. ఓ వాహనంపై చిన్నారితో సహా తల్లి వస్తున్నారు. హైవే మీద వారు రాగా.. కారు డ్యాష్ ఇచ్చింది. అసలే పెద్ద వాహనం అయే.. ఇంకేముంది బైక్ కుదేలైంది. బైక్ మీద కూర్చొన్న మహిళ, చిన్నారి రోడ్డుపై పడిపోయారు. అదీ రద్దీగా ఉండే రోడ్ అయినందున.. ఆ పక్కనే ట్రక్ వెళుతుంది. అంతా రెప్పపాటులో జరిగింది. సో ఆ మాతృమూర్తి అంతే వేగంగా స్పందించింది. తన బిడ్డను లాగి.. తాను కూడా ట్రక్కు నుంచి తప్పించుకుంది. ఈ వీడియోకు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తల్లికి వందనం అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

రెప్పపాటులో ప్రమాదం నుంచి సేవ్
ఆమె అలా కాపాడిన తర్వాత.. ఆమెతో వచ్చిన బైకర్ ఏం జరిగిందో చూశాడు. బండి పక్కన ఆపే వరకు మనకు విజువల్ కనిపించింది. కానీ ఈ వీడియో మాత్రం ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తోంది. అవును రెప్పపాటులో వారు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. లేదంటే సిచుయేషన్ మరొలా ఉండేది. కానీ వారి వైపు భగవంతుడు వారి వైపు ఉన్నారు. దీంతో వారిద్దరూ ప్రాణాలతో బయటపడగలిగారు. హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. జరిగిన ఘటనను గుర్తుచేస్తూ.. భయాందోళనకు గురవుతున్నారు.
5 మిలియన్ వ్యూస్
తల్లి, బిడ్డకు మాత్రం స్వల్పంగా గాయాలు అయ్యాయి. ప్రాణం నిలువడంతో ఆ చిన్న గాయం లెక్కే కాదు. ఆ తల్లిని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఇప్పటికే 5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఆ తల్లి చేసిన సాహసానికి ఇంటర్నెట్ సెల్యూట్ చేస్తోంది. ప్రతీ ఒక్కరు ఆ తల్లిని ప్రశంసిస్తూనే ఉన్నారు. వావ్ నిజంగా గ్రేట్.. ఆ వీడియో చూసి.. ఏం జరిగిందో ఊహించుకోలేం. అవును.. కానీ ఆ తల్లి మాత్రం ప్రాణాలకు తెగించి మరీ పోరాడింది. తన బిడ్డను దక్కించుకుంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications