వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా బండారాన్ని బయటపెట్టిన శాటిలైట్ ఫొటోలు: 4 కి.మీ మేర: అరుణాచల్ అయిపోయింది..ఇక అక్కడ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో తరచూ ఉద్రిక్తత పరిస్థితులకు కారణమౌతోన్న డ్రాగన్ కంట్రీ చైనా.. తన దుందుడుకు చర్యలకు ఏ మాత్రం పుల్‌స్టాప్ పెట్టట్లేదు. సరికదా చాపకింద నీరులా మరింతగా విస్తరించుకుంటూ పోతోంది. కేంద్ర పాలిత ప్రాంతం లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద తరచూ భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడానికి ప్రయత్నిస్తోన్న చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) బలగాలు.. అరుణాచల్ ప్రదేశ, సిక్కిం సరిహద్దుల్లో తరచూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. ఇదివరకు అరుణాచల్ ప్రదేశ్ వద్ద సరిహద్దుల్లో ఏకంగా ఓ గ్రామాన్నే నిర్మించిన చైనా ఆర్మీ.. ఇక సిక్కిం సమీపంలోని నకు లా పాస్ వద్ద వివాదాస్పద ప్రదేశాల్లో కొత్తగా ఆర్మీ పోస్టులను ఏర్పాటు చేసింది.

డోక్లామ్.. నకు లా పాస్..

డోక్లామ్.. నకు లా పాస్..

దీనికి సంబంధించి ప్రముఖ జాతీయ న్యూస్ ఛానల్ ఇండియా టుడే ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. నకు లా పాస్ వద్ద చైనా ఆర్మీ కొత్తగా నిర్మించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను విడుదల చేసింది. భారత్-చైనా సరిహద్దులను పంచుకుంటోన్న సిక్కిం సమీపంలోని డోక్లామ్, నకు లా పాస్ తరచూ ఈ రెండు దేశాల మధ్య వివాదాలకు కేంద్రబిందువు అవుతూ వస్తోంది. భారత్-చైనా-భూటాన్ సరిహద్దుల్లో ట్రై జంక్షన్‌గా గుర్తింపు ఉన్న డోక్లామ్ ప్రాంతం వద్ద గ్రౌండ్ జీరో వద్ద 2017లో భారత్-చైనా జవాన్ల మధ్య ఘర్షణపూరక వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.

 శాటిలైట్ ఫొటోల విశ్లేషణలో..

శాటిలైట్ ఫొటోల విశ్లేషణలో..

అప్పటి నుంచీ చైనా సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రదేశాల్లో ఉద్రిక్తతలకు కారణమౌతోంది. నకు లా సరిహద్దు వద్ద తాజాగా కొత్తగా ఆర్మీ పోస్టులను నిర్మించింది. క్యాపెల్లా స్పేస్‌ కంపెనీకి చెందిన సింథటిక్-అపెచ్యుర్ రాడార్, ప్లానెట్ ల్యాబ్స్ చిత్రీకరించిన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో ఈ ఆర్మీ పోస్టులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మార్చి 12వ తేదీన రాడార్ ఈ ఫొటోలను తీసింది. చైనా మిలటరీ కార్యకలాపాలు ఉధృతంగా కొనసాగుతున్న విషయాన్ని బట్టబయలు చేసింది. కొత్త శిబిరాలు, పోస్టులు, రోడ్ల నిర్మాణాలు ముమ్మరంగా సాగుతున్నట్లు ఇండియా టుడే తన ప్రత్యేక కథనంలో పేర్కొంది.

ఆర్మీ పోస్టులు.. రోడ్లు..

ఆర్మీ పోస్టులు.. రోడ్లు..


ఈ కొత్త పోస్టులు, ఆర్మీ శిబిరాల నిర్మాణం.. అంతర్జాతీయ సరిహద్దు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్నట్లు స్పష్టం చేసింది. ఆ ప్రదేశం అంతా గ్రౌండ్ జీరో కిందికి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. మార్చి 12వ తేదీన శాటిలైట్, రాడార్ షూట్ చేసిన ఫొటోల ఆధారంగా చూస్తే.. గత ఏడాది సెప్టెంబర్‌లో ఖాళీగా కనిపించిన నకు లా పాస్ సమీపంలోని పలు ప్రాంతాల్లో కొత్తగా చైనా ఆర్మీ పోస్టులు, శిబిరాలు వెలిశాయనేది స్పష్టమౌతోంది. అదే సమయంలో- ఆయా పోస్టులకు చేరుకోవడానికి, భారీ వాహనాలు రాకపోకలు సాగించేలా రోడ్లను నిర్మిస్తున్నట్లు తేలింది.

ఏడాదికాలంగా ముమ్మరం..

ఏడాదికాలంగా ముమ్మరం..


సిక్కిం సరిహద్దుల్లో చైనా ఆర్మీ తన కార్యకలాపాలను ఏడాదికాలంగా విస్తృతం చేస్తూ వస్తోందనే విషయం తాజా ఫొటోలతో స్పష్టమౌతోంది. అవేవీ రాత్రికి రాత్రి వెలిసిన శిబిరాలు కాదు. అమెరికాకు చెందిన జియోస్పేషియల్ అనలిటిక్స్ కంపెనీ హాక్ఐ 360.. గత ఏడాది తొలిసారిగా సరిహద్దుల్లో చైనా ఆర్మీ పోస్టు ఏర్పాటైనట్లు నిర్ధారించింది. అది కాస్తా మరింత విస్తృతమైంది. లఢక్ వాస్తవాధీన రేఖ సమీపంలోని గాల్వన్ వ్యాలీ తరహా అక్రమ చొరబాట్లకు చైనా సైనికులు పూనుకునే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని సరిహద్దులకు సమీపంలోని హసిమారా ఎయిర్ బేస్ స్టేసన్‌లో రాఫెల్ యుద్ధ విమానాలను మోహరించే అవకాశాలు ఉన్నట్లు ఇండియా టుడే అంచనా వేసింది.

English summary
The Chinese activity near Naku La border in Sikkim. The construction of roads and new posts by the Chinese ground forces in this area. The People's Liberation Army (PLA) activity opposite Naku La visibly increased after the Galwan valley clash in eastern Ladakh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X