Kamal Haasan: బస్సు డ్రైవర్ ఉద్యోగం కోల్పోయిన మహిళ.. కారు బహుమతిగా ఇచ్చిన కమల్..
కోయంబత్తూరు తొలి మహిళా బస్సు డ్రైవర్ షర్మిలకు తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ కారును బహుమతిగా ఇచ్చారు. గత వారం డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధికి ప్రయాణ టికెట్ విషయంలో తలెత్తిన వివాదం కారణంగా షర్మిల అనే బస్సు డ్రైవర్ ఇటీవల తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సిసి వచ్చింది. కమల్ పన్బట్టు మైయం లేదా కమల్ కల్చరల్ సెంటర్ తరపున కొత్త కారు అందించారు.
డీఎంకే ఎంపీ కనిమొలి కోయంబత్తూర్‌లోని గాంధీపురం నుంచి పీలమేడు వరకు ఓ ప్రైవేట్ బస్సులో ప్రయాణించారు. అయితే కనిమొలి బస్సులో ప్రయాణిస్తుండగా.. కండక్టర్ టికెట్ తీసుకోవాలని కోరారు. దీన్ని డ్రైవర్ షర్మిల వ్యతిరేకించారు. ఈ విషయమై ట్రావెల్స్ యాజమాన్యం షర్మిలను ఉద్యోగం నుంచి తప్పించింది. దీనిపై స్పందించిన కమల్.. ఆమెకు కారును బహుమతిగా ఇచ్చాడు.

కనిమొళి పర్యటన గురించి తమకు సమాచారం అందలేదని రవాణా సంస్థ తెలిపింది. షర్మిల తన ఇష్టానుసారం వెళ్లిపోయిందని.. అందుకే ఉద్యోగం నుంచి తొలగించామని పేర్కొంది. కనిమొలి షర్మిల నడిపి బస్సులో ప్రయాణిస్తుండగా.. షర్మిలకు గడియారాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు. మొదటి మహిళ బస్సు డ్రైవర్ గా పేరు పొందిన షర్మిల పాపులారిటీ కోసం బస్సులో ప్రయాణించేందుకు తరచుగా సెలబ్రిటీలను ఆహ్వానిస్తూ.. ప్రయాణికులను అసౌకర్యానికి గురిచేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
Coimbatore's first woman bus driver #Sharmila who quit her job after a controversy erupted over issuing a ticket to DMK MP Kanimozhi, has been gifted with a brand new car by MNM leader #KamalHaasan 👌 nice gesture! pic.twitter.com/vJxRlHH0Ie
— Siddarth Srinivas (@sidhuwrites) June 26, 2023
కమల్ షర్మిలకు కారు బహుమతిగా వచ్చిన విషయాన్ని ఫిల్మ్ ఇండస్ట్రీ ట్రాకర్ సిద్దార్థ శ్రీనివాస్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆయన ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా కమల్ హాసన్ ప్రభాస్ దీపికా పదుకొనే అమితాబ్ బచ్చన్ నటిస్తున్న ప్రాజెక్ట్ కెలో కనిపించనున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications