బెంగళూరులో కమల్ హాసన్ షాపింగ్, ఫ్యాన్స్ సందడి, హీరో ఏం చేశారంటే, వీడియో వైరల్!

బెంగళూరు: ప్రముఖ బహుబాష నటుడు, దర్శకుడు కమల్ హాసన్ ఆయన అభిమానిపై చెయ్యి చేసుకున్న ఘటన వీడియో ఇప్పుడు సోసల్ మీడియాలో వైరల్ అయ్యింది. బెంగళూరు వచ్చిన కమల్ హాసన్ తనను కలవడానికి వచ్చిన అభిమానిపై చెయ్యి చేసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కమల్ ఆయన అభిమానిపై చెయ్యి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

బెంగళూరు చేరుకున్న కమల్ హాసన్ తన స్నేహితుడు, బహుబాష నటుడు, దర్శక నిర్మాత రమేష్ అరవింద్ తో కలిసి ప్రసిద్ది చెందిన మాల్ లో షాపింగ్ చెయ్యడానికి వెళ్లారు. తమ అభిమాన నటుడు బెంగళూరు వచ్చారని తెలుసుకున్న ఆయన అభిమానులు షాపింగ్ మాల్ దగ్గరకు పరుగుతీశారు.

షాపింగ్ పూర్తి చేసుకున్న కమల్ హాసన్, రమేష్ అరవింద్ బయటకు బయలుదేరారు. ఆ సందర్బంలో అభిమానులు కమల్ హాసన్ ను కలవడానికి పోటీ పడ్డారు. ఓ అభిమాని కమల్ హాసన్ ను పలకరించి ఆయన కాళ్ల మీదపడి ఆశీర్వాదం తీసుకోవడానికి ప్రయత్నించాడు.

ఆ సందర్బంలో అసహనానికి గురైన హీరో కమల్ హాసన్ అభిమాని కంటి మీద దాడిచేసి వెనక్కి నెట్టేశారని ఆరోపణలు ఉన్నాయి. తరువాత కమల్ హాసన్ భద్రత కోసం వెళ్లిన పోలీసులు అభిమానులను అదపు చేశారు. కమల్ హాసన్ ఎవ్వరిమీద దాడి చెయ్యలేదని, వీడియోను కావాలనే రాద్దాంతం చేస్తున్నారని ఆయన అభిమాన సంఘాల నాయకులు అంటున్నారు.
మొత్తం మీద కమల్ హాసన్ అభిమాని మీద దాడి చేసే వీడియో ఇప్పటికే సోసల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+