వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీలోకి కమల్ హాసన్ ? కేంద్ర మంత్రితో చర్చలు

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో జల్లికట్టు నిర్వహించాలని, ఎలాంటి ఆంక్షలు పెట్టరాదని సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు కమల్ హాసన్ ను కేంద్ర మంత్రి పొన్. రాధాకృష్ణన్ కలుసుకున్నారు.

మంగళవారం రాత్రి చెన్నైలో కమల్ హాసన్, కేంద్ర మంత్రి పొన్. రాధాకృష్ణన్ ఏకాంతంగా చర్చలు జరిపారు. వీరిద్దరూ జల్లికట్టు, రాజకీయాలపై చర్చించారని సమాచారం. కమల్ హాసన్, కేంద్ర మంత్రి పొన్. రాధాకృష్ణన్ చర్చించే సమయంలో ఆ గదిలోకి ఎవ్వరినీ అనుమంతించలేదు.

<strong>జల్లికట్టు కాదు, దమ్ముంటే ఇవి బ్యాన్ చెయ్యండి: కమల్ హాసన్</strong>జల్లికట్టు కాదు, దమ్ముంటే ఇవి బ్యాన్ చెయ్యండి: కమల్ హాసన్

ఆసమయంలో కేంద్ర మంత్రి పొన్. రాధాకృష్ణన్ మీరు బీజేపీలో చేరాలని, రాజకీయాల్లో చురుకుగా పాల్గోని ప్రజాసేవ చెయ్యాలని కమల్ హాసన్ కు చెప్పారని సమాచారం. అయితే ఈ విషయంపై కమల్ హాసన్ ఏ విషం స్పష్టం చెయ్యలేదని తెలిసింది.

Actor Kamal hassan meets union minister Pon Radhakrishnan

కేంద్ర మంత్రి పొన్. రాధాకృష్ణన్ తో చర్చించక కొన్ని గంటల ముందే కమల్ హాసన్ మీడియాతో మాట్లాడారు. జల్లికట్టు సాంప్రధాయ క్రీడ అంటూ దాని చరిత్ర గురించి గొప్పగా చెప్పారు. జల్లికట్టును పరోక్షంగా అడ్డుకుంటున్న వారి మీద విరుచుకుపడ్డారు.

<strong>షాకింగ్ వీడియో ట్వీట్ చేసిన కమల్ హాసన్, పోలీసులే ఇలా, ఛీ!</strong>షాకింగ్ వీడియో ట్వీట్ చేసిన కమల్ హాసన్, పోలీసులే ఇలా, ఛీ!

మీరు రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతుంది కదా అని మీడియా ప్రశ్నిస్తే తాను రాజకీయాల్లోకి రాను అని కమల్ హాసన్ అన్నారు. రాజకీయాలు అంటే నాకు ముందు నుంచి పెద్దగా ఆసక్తిలేదని, అయినా చూద్దాం ఎం జరుగుతుందో అని చెప్పారు.

ఆయన తాను రాజకీయాల్లోకి రాను అని చెప్పిన కొన్ని గంటల వ్యత్యాసంలోనే ప్రధాని మోడీకి సన్నిహితుడైన కేంద్ర మంత్రి పొన్. రాధాకృష్ణన్ స్వయంగా కమల్ హాసన్ తో చర్చలు జరపడంతో ఆయన బీజేపీలో చేరుతున్నారని కమల్ అభిమానులు అంటున్నారు. అదే జరిగితే తాము పండగ చేసుకుంటామని కమల్ హాసన్ అభిమానులు చెప్పారు.

English summary
Tamil Nadu: Actor Kamal hassan yesterday meets union minister Pon.Radhakrishnan in chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X