రజనీకాంత్ ను మా పార్టీలోకి ఆహ్వానిస్తా: మాకు సీనిమాలతోనే పోటీ: రాజకీయాల్లో, కమల్ హాసన్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తాను రాజకీయాల్లోకి కచ్చితంగా వస్తానని ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన బహుబాష నటుడు, దర్శకుడు కమల్ హాసన్ ఇప్పుడు మరో సంచనల వ్యాఖ్యాలు చేశారు. అవరసరం అయితే తమిళ ప్రజల కోసం సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి పని చెయ్యడానికి తాను సిద్దంగా ఉన్నానని అన్నారు.

తాను కొత్తగా స్థాపించబోయే పార్టీలోకి సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఆహ్వానిస్తానని కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ అరంగ్రేటంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా రజనీకాంత్ తన అభిమానులను గందరగోళానికి గురి చేస్తున్న సమయంలోనే కమల్ హాసన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Actor Kamal Hassan says would work with Rajanikanth if he ever join Politics

ఓ తమిళ సాయంత్రం దినపత్రికకు కమల్ హాసన్ ఇంటర్వూ ఇచ్చారు. సినిమాల పరంగానే రజనీకాంత్ కు తనకు పోటీ ఉందని, కీలక సమస్యలపై గతంలో ఇద్దరూ చర్చించుకుని పోరాటం చేసిన దాఖలాలు ఉన్నాయని కమల్ హాసన్ గుర్తు చేశారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే మంచిదే అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

రజనీకాంత్ మా పార్టీలోకి వస్తేనంటే చాలసంతోషం, ఆయనతో కలిసి పార్టీని ముందుకు నడిపించడానికి తాను సిద్దంగా ఉన్నానని కమల్ హాసన్ చెప్పారు. వచ్చే నెలలో బిగ్ బాస్ షో పూర్తి అయిన వెంటనే పూర్తి రాజకీయాలపై మనసు పెడుతానని, తమిళ ప్రజల కోసం పని చేస్తానని కమల్ హాసన్ వివరించారు.

జయలలిత మరణించిన తరువాత తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ మీద కమల్ హాసన్ వీలుచిక్కినప్పుడు ప్రతిసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్ లో కమల్ హాసన్ కొత్త పార్టీ పెడుతారని, ఆయన ఏ పార్టీలో చేరే అవకాశం లేదని ఆయన సన్నిహితులు అంటున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Actor Kamal Haasan says would be willing to work with Rajinikanth if the superstar ever decides to enter politics.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X