నీకసలు బుద్ధుందా.. హీరోయిన్ ఫైర్
Challenging Star Darshan: ప్రముఖ కన్నడ నటుడు, శాండిల్‌వుడ్ సూపర్ స్టార్ దర్శన్ తూగుదీపకు బిగ్ షాక్ తగిలింది. ఆయనకు లభించిన బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీనిపై గతంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. న్యాయస్థానం ముందు లొంగిపోవాలని ఆదేశించింది.
రేణుక స్వామి హత్యకేసులో దర్శన్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ కేసులో గత ఏడాది ఆయన తొలుత అరోగ్య కారణాలతో బెయిల్ పొందారు. అనంతరం డిసెంబర్ 13వ తేదీన కర్ణాటక హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అలాగే- ఇదే కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ నటి పవిత్ర గౌడ, మరో 15 మంది నిందితులకూ షరతులతో కూడిన బెయిల్ లభించింది అప్పట్లో.

దీన్ని సవాల్ చేస్తూ పోలీసులు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దీవాలా సారథ్యంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదోపవాదాలను ఆలకించింది. తాజాగా తుది తీర్పు వెలువడించింది. దర్శన్ బెయిల్ ను కొట్టివేసింది.
ఇదే కేసులో దర్శన్ తో పాటు ప్రముఖ నటి పవిత్ర గౌడ బెయిల్ కూడా రద్దయింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమె ఏ1గా ఉన్నారు. బెంగళూరులోని నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో పవిత్ర గౌడ అసహనంగా కనిపించారు. మెట్లు దిగే సమయంలో తన ఎదురుగా మొబైల్ ఫోన్ లో తనను చిత్రీకరిస్తోన్న ఓ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం పవిత్ర గౌడను పరప్పన అగ్రహార కేంద్ర కారాగారానికి తరలించారు. సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడిన వెంటనే తన ఇన్ స్టాగ్రామ్ లో ఆమె ఓ టిపికల్ పోస్ట్ పెట్టారు. దేవుని మీద నమ్మకం ఉంచాలి. భగవంతుడి ఆశీస్సులు లభించేంత వరకు ఎదురు చూడక తప్పదు. కొన్నిసార్లు జరగొచ్చు. అది దైవిక రక్షణ కోసమే. నేను సహనం విశ్వాసాన్ని ఎంచుకుంటాను.. అని పవిత్ర గౌడ్ రాసుకొచ్చారు.
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్.. ప్రధాన నిందితుడు. కన్నడ నటి పవిత్ర గౌడపై సోషల్ మీడియాలో అసభ్యకర, అశ్లీలకరమైన పోస్టులు, కామెంట్స్ చేస్తుండేవాడనే కారణంతో రేణుకా స్వామిపై కక్ష పెంచుకుని సుపారీ ఇచ్చి అతణ్ని హత్య చేయించాడనే ఆరోపణలపై గత ఏడాది జూన్ 11వ తేదీన అరెస్ట్ అయ్యారు.
దర్శన్, పవిత్ర గౌడ, మరో 15 మంది పేర్లపై పోలీసులు ఛార్జిషీట్ నమోదు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 3,991 పేజీల ఛార్జ్‌షీట్ ఇది. ఇందులో ఏ1గా పవిత్ర గౌడ, ఏ2గా దర్శన్ పేర్లను నమోదు చేశారు. బెంగళూరు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ చందన్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దర్యాప్తు బృందం ఈ ఛార్జ్‌షీట్‌ను కోర్టుకు అందజేసింది.
ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదికలు కూడా ఇందులో ఉన్నాయి. బెంగళూరులోని 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దీనిపై విచారణ చేపట్టింది. రేణుక స్వామి కిడ్నాప్, హత్యకేసులో ముగ్గురు ప్రత్యక్ష సాక్షులతో పాటు 231 మంది సాక్షులను విచారించినట్లు ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచారు.
రేణుక స్వామి హత్యకు కుట్ర పన్నడం, దాన్ని అమలు పరచడం, కిడ్నాప్, చిత్రహింసలు పెట్టడం, హత్య, సాక్ష్యాలను ధ్వంసం చేయడం, తామే హత్య చేసినట్లుగా నలుగురిని పోలీసుల ఎదుట లొంగిపోయేలా ప్రరేపించడం, దీని ద్వారా కేసు దర్యాప్తు, పోలీసులను తప్పుదోవ పట్టించేలా ప్లాన్ చేయడంలో దర్శన్, పవిత్ర గౌడ పాత్ర ఉందని చార్జిషీట్‌లో పేర్కొన్నారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications