నమ్మించి మోడల్‌ను వాడుకున్న యాక్టర్

ముంబై: సినిమాల్లో చాన్స్ కొట్టేయాలనే ఆశతో ముంబై నగరంలో అడుగు పెట్టిన ఓ యువతి ఓ టీవీ నటుడి చేతిలో మోసపోయింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి, ఆ తర్వాత మోసం చేశాడని మోడల్‌గా పనిచేస్తున్న ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దాంతో టీవీ నటుడు అర్మాన్ తాహిల్‌పై పోలీసులు అత్యాచారం కింద కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువతి నటిగా మారాలని 2011లో ముంబై చేరుకుంది. అవకాశాల కోసం ఎంతగానో ప్రయత్నించింది. చివరకు చిన్న చిన్న వాటిల్లో మోడల్‌గా పనిచేస్తూ చివరకు ఓ మేనేజ్‌మెంట్ కంపెనీ కింద మోడల్‌గా పనిచేస్తోంది.

ఆమెకు 2013లో అర్మాన్ తాహిల్ అనే టీవీ నటుడితో ఓ ఆలయం వద్ద పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత అతుడు ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. దాంతో ఆమెపై అతను పలుమార్లు లైంగికంగా దాడి చేశాడు.

Actor refuses to marry model, booked for rape

పెళ్లి మాట వచ్చే సరికి మొహం చాటేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. తాహిల్ చాలా మంచివాడని, 2015లో తన ఇంటికి కూడా తీసుకుని వెళ్లాడని, కానీ కొద్ది రోజుల తర్వాత అతడి ప్రవర్తన మారిపోయిందని, డబ్బులు డిమాండ్ చేయడంతో లక్ష రూపాయలు ఇచ్చానని ఆమె ఫిర్యాదులో చెప్పింది.

తాహిల్ మరో మహిళతో కూడా సంబంధం పెట్టుకున్నాడని ఆమె ఆరోపించింది. పెళ్లి చేసుకోవాలని ఈ నెల 8వ తేదీన కోరగా అతను నిరాకరించడంతో ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+