వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాధిక శరత్ కుమార్ లకు ఏడాది పాటు జైలు శిక్ష విధించిన చెన్నై ప్రత్యేక కోర్టు .. మ్యాటర్ ఏంటంటే !!

|
Google Oneindia TeluguNews

చెక్ బౌన్స్ కేసులో తమిళ నటుడు శరత్‌కుమార్, ఆయన భార్య, నటి రాధిక శరత్‌కుమార్‌లకు ఏడాది జైలు శిక్ష విధించినట్లు చెన్నైలోని ప్రత్యేక కోర్టు బుధవారం తెలిపింది. చెన్నైలోని సైదాపేట కోర్టులో తమిళ నటుడు శరత్ కుమార్ కు, ఆయన భార్య రాధిక శరత్ కుమార్ కు ఎదురు దెబ్బ తగిలింది. 2017 నాటి చెక్ బౌన్స్ కేసులో ఇరువురికి న్యాయస్థానం ఏడాది పాటు శిక్ష విధించింది.

Tamil Nadu Assembly Election 2021: కమల్ హాసన్ సీఎం అవ్వటం ఖాయం - రాధికా శరత్ కుమార్Tamil Nadu Assembly Election 2021: కమల్ హాసన్ సీఎం అవ్వటం ఖాయం - రాధికా శరత్ కుమార్

రేడియన్ సంస్థ నుండి సినిమా నిర్మాణం కోసం అప్పు చేసిన రాధిక శరత్ కుమార్

రేడియన్ సంస్థ నుండి సినిమా నిర్మాణం కోసం అప్పు చేసిన రాధిక శరత్ కుమార్

రాధిక శరత్ కుమార్ దంపతులపై పెండింగ్‌లో ఉన్న రెండు చెక్ బౌన్స్ కేసుల్లో నేరారోపణలను రద్దు చేయడానికి 2019 లో మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. నందనంలోని రేడియన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, సినిమాల నిర్మాణానికి రుణాలు ఇచ్చే సంస్థ, టేనాంపేట్‌లోని మ్యాజిక్ ఫ్రేమ్‌లకు భారీ మొత్తాలను అప్పుగా ఇచ్చింది . రేడియన్ సంస్థ నుండి సినిమా నిర్మాణం కోసం శరత్‌కుమార్, అతని భార్య రాధిక రెండు కోట్ల రూపాయలను అప్పుగా తీసుకున్నారు.

చెక్ బౌన్స్ అయిన కేసులో రాధిక , శరత్ కుమార్ లకు కోర్టులో షాక్

చెక్ బౌన్స్ అయిన కేసులో రాధిక , శరత్ కుమార్ లకు కోర్టులో షాక్

శరత్ కుమార్ , రాధిక మరియు ఒక లిస్టిన్ స్టీఫెన్ భాగస్వాములుగా పలు సినిమాలను నిర్మించారు. అయితే రేడియన్ సంస్థ నుంచి తీసుకున్న అప్పును సమయానికి తేల్చలేక పోయారు. రాధిక శరత్ కుమార్ లు ఇచ్చిన చెక్కు బౌన్స్ కావడంతో ఈ విషయమై సదరు సంస్థ కోర్టుకు వెళ్లింది. 2019లో వీరికి అరెస్టు వారెంట్ సైతం జారీ అయింది. అయితే 2019లో కోర్టు తీర్పును సవాల్ చేస్తూ కోర్టు తమకు విధించిన శిక్షను సస్పెండ్ చేయాలని రాధిక శరత్ కుమార్ దంపతులు ఇప్పుడు ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు.

ఏడాది పాటు జైలు శిక్ష విధించిన కోర్టు .. తీర్పుపై సవాల్ చెయ్యనున్న దంపతులు

ఏడాది పాటు జైలు శిక్ష విధించిన కోర్టు .. తీర్పుపై సవాల్ చెయ్యనున్న దంపతులు

ఇక నేడు విచారణ చేపట్టిన కోర్టు ఆధారాలను పరిశీలించి ఈ కేసులో రాధిక శరత్ కుమార్ లకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది. దీంతో మరోమారు కోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాధిక శరత్ కుమార్ లు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు సమాచారం.

ఇక కోర్టు తీర్పుపై రాధిక , శరత్ కుమార్ లు స్పందించాల్సి ఉంది .

English summary
A special court in Chennai, on Wednesday, sentenced Tamil actor Sarathkumar and wife and actress Radhikaa Sarathkumar to one year imprisonment in a cheque bounce case. In 2019, the Madras High Court had declined to quash the criminal proceedings in two cheque bounce cases pending against the actor couple. Radiance Media Private Limited at Nandanam, a firm lending money for production of movies, had lent huge sums to Magic Frames at Teynampet, in which Sarathkumar, his wife Radhikaa and one Listin Stephen are partners.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X