శృతి హాసన్..ఐసొలేషన్: కరోనా వైరస్ బారిన పడ్డ నటి
హైదరాబాద్: దేశంలో ప్రాణాంతక కరోనా వైరస్ కేసుల తీవ్రత భారీగా తగ్గింది. దేశవ్యాప్తంగా రోజువారీ పాజిటివ్ కేసులు నామమాత్రంగా నమోదవుతున్నాయి. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. కార్లల్లో ప్రయాణించే సమయంలో మాస్కులను ధరించడం ఇక తప్పనిసరి కాదంటూ ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఆదేశాలను కూడా జారీ చేసింది. అయినప్పటికీ కోవిడ్ ప్రొటోకాల్స్‌ను మాత్రం యధాతథంగా ఇంకొన్నాళ్ల పాటు కొనసాగించక తప్పదంటూ కేంద్రం కూడా సూచిస్తోంది.
దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 10,273 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 243 మంది కోవిడ్ వల్ల మృత్యువాత పడ్డారు. 20,439 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ఆరోగ్యవంతులయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1,11,472గా నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేటు ఒక శాతం మాత్రమే. ఇప్పటిదాకా కరోనా బారిన పడి 5,13,724 మంది మరణించారు. 4,22,90,921 మంది రికవరీ అయ్యారు. ఇప్పటిదాకా 1,77,44,08,129 డోసుల వ్యాక్సిన్ వినియోగమైనట్లు కేంద్రం తెలిపింది.

కాగా- కరోనా వైరస్ చివరి దశలో ఉన్న పరిస్థితుల్లో బహుభాషా నటి శృతి హాసన్ దీని బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె ఐసొలేషన్‌లో ఉన్నారు. అన్ని రకాల ఆరోగ్యపరమైన జాగ్రత్తలను తీసుకుంటున్నారు. తాను అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ- వైరస్ సోకిందని శృతి హాసన్ చెప్పారు. తన ఆరోగ్యం బాగుందని, ఎవరూ ఆందోళన పడొద్దని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే తాను ఈ వైరస్ బారి నుంచి కోలుకుని మళ్లీ అభిమానుల ముందుకు వస్తానని అన్నారు. ఈ మేరకు శృతి హాసన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ సమాచారాన్ని పోస్ట్ చేశారు.
Recommended Video
ఇదివరకు ఆమె తండ్రి కమల్ హాసన్‌కు కూడా కోవిడ్ సోకిన విషయం తెలిసిందే. శృతి హాసన్ కోవిడ్ బారిన పడిన సమాచారం తెలిసిన వెంటనే బాలీవుడ్ సెలెబ్రెటీలు స్పందించారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సిద్ధార్థ్ మల్హోత్ర, సోఫియా చౌదరి వంటి పలువురు ప్రముఖులు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రిప్లై ఇస్తోన్నారు. ప్రస్తుతం ఆమె సలార్ సినిమాలో నటిస్తోంది. ఇది పాన్ ఇండియా మూవీ. ప్రభాస్ హీరో. ప్రశాంత్ నీల్ దర్శకుడు. శృతి హాసన్ నటించిన థ్రిల్లర్ వెబ్ సిరీస్- బెస్ట్ సెల్లర్. ఈ నెల 18న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications