వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Subtle cock champion: సైనా నెహ్వాల్‌పై సెక్సీయెస్ట్ కామెంట్స్: నటుడు సిద్ధార్థ్‌పై ఫైర్

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళ నటుడు సిద్ధార్థ్ మరోసారి వివాదాలకు కేంద్రబిందువు అయ్యారు. మొన్నటికి మొన్న ఏపీలో సినిమా టికెట్ల విషయంలో జగన్ సర్కార్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన ఆయన.. ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోన్నాయి. జాతీయ మహిళా కమిషన్ సైతం ఈ విషయంలో జోక్యం చేసుకుందంటే- ఆ కామెంట్స్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

సిద్ధార్థ్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ ఎన్‌సీడబ్ల్యూ మహారాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు లేఖ రాసింది. ఆయన ట్విట్టర్ అకౌంట్‌ను నిషేధించాలంటూ సంబంధిత సంస్థనూ కోరింది. దీనికంతటికీ- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భద్రతా వైఫల్యం కారణం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మోడీ పంజాబ్ పర్యటనకు వెళ్లిన సమయంలో ఆయన ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఫిరోజ్‌పూర్‌ జిల్లాలో ఫ్లైఓవర్‌పై సుమారు 20 నిమిషాల పాటు ఆయన ట్రాఫిక్‌లో ఉండిపోవాల్సి వచ్చింది.

 Tamil actor Siddharth attacked ace Badminton player Saina Nehwal with a crass, sexually derogatory comment.

దీనిపై స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ స్పందించారు. సాక్షాత్తూ ఓ ప్రధానమంత్రి భద్రత వ్యవస్థలో లోపాలు తలెత్తడాన్ని ఏ దేశం కూడా చూస్తూ ఊరుకోబోదని అన్నారు. ప్రధాని భద్రత వ్యవహారాలతో రాజీపడటం శ్రేయస్కరం కాదని చెప్పారు. ఈ ఘటనను తాను ఖండిస్తున్నానని సైనా నెహ్వాల్ చెప్పారు. ప్రధానిపై కొందరు అరాచకవాదులు దాడి చేయడానికి ప్రయత్నించారని, అది పిరికిపంద చర్యగా సైనా నెహ్వాల్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె ఓ ట్వీట్ చేశారు.

దీనిపై సిద్ధార్థ్ స్పందించారు. ఆమె చేసిన ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. సెక్సీయెస్ట్ కామెంట్స్ చేశారు. షటిల్ కాక్‌ను సబ్‌టల్ కాక్‌గా అభివర్ణించారు. సబ్‌టల్ కాక్ ఛాంపియన్ (Subtle cock champion) అంటూ సంబోధించారు. సబ్‌టల్ కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్.. అంటూ ఎద్దేవా చేశారు. భారత్‌కు సంరక్షకులు ఉండటం తమ అదృష్టమని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతోన్నాయి. సబ్‌టల్ కాక్ అనే పదాన్ని ప్రయోగించడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి.

దీనిపై జాతీయ మహిళా కమిషన్ సైతం స్పందించింది. సిద్ధార్థ్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు కమిషన్ ఛైర్ పర్సన్ రేఖా శర్మ మహారాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌, ట్విట్టర్ ఇండియాకు లేఖలు రాసింది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయాన్ని తమకు తెలియజేయాలని సూచించారు. సిద్ధార్థ్ అకౌంట్‌ను బ్లాక్ చేయాలని ట్విట్టర్ ఇండియాను కోరారు. బ్లూటిక్ ఇవ్వడం సహేతుకం కాదని అన్నారు.

English summary
Tamil actor Siddharth attacked ace Badminton player Saina Nehwal with a crass, sexually derogatory comment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X